UPDATES  

NEWS

కవితక్క కొత్త పార్టీ పేరు TRS జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,

రేపటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయండి

కొత్తగూడెం (తెలంగాణ వాణి) రేపు కొత్తగూడెంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఆధ్వర్యంలో బీ‌ఆర్ఎస్ జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు కొట్టి వెంకటేశ్వర రావు తెలిపారు. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆదేశాల మేరకు కొత్తగూడెం తెలంగాణ భవన్ లో జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం జిల్లా […]

ఈటెల రాజేందర్ కొత్తగూడెం పర్యటన వాయిదాకు కారణమేంటి

జిల్లా నాయకుల మధ్య విభేదాలా ? అగ్రకుల నాయకుల రాజీనామా బెదిరింపులా ? కొత్తగూడెం (తెలంగాణ వాణి) అగ్రకులాల బెదిరింపులతో బీసీ వర్గానికి చెందిన ఓ ఎంపీ గొంతు మూగబోయిందా. ఇప్పుడు ఇదే విషయం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో చర్చనియాంశంగా మారింది. బీజేపీ జిల్లా పార్టీలో ఇలాంటి ఘటనల వల్ల పార్టీ పరువు పోవడం ఖాయమన్న సంగతి కూడ మర్చిపోయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీసీ గొంతుక, జాతీయ నాయకుడు, మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు, మల్కాజ్గిరి […]

బావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలవనపర్తి గ్రామానికి చెందిన నక్క బీమమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానిక ఎస్సై శీలం లక్ష్మణ్ తెలిపారు. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు గత రెండేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ అనేక ఆసుపత్రిలలో చికిత్స చేపించుకున్న క్యాన్సర్ వ్యాధి నయం కాకపోవడంతో మనస్థాపం చెందిన నక్క భీమమ్మ దసరా రోజు సాయంత్రం 6 […]

భద్రాద్రి జిల్లాలో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

చేయని తప్పుకు బలి పశువును చేశారు అన్యాయంగా కేసులో ఇరికించారని ఆవేదన  బూర్గంపహాడ్ (తెలంగాణ వాణి) గతంలో గంజాయి కేసులో నిందితుడిగా ఉన్న కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్న ఘటన జిల్లా పోలీస్ యంత్రాంగంలో కలకలం రేపింది. బూర్గంపహాడ్ ఎస్సై, బిఆర్ఎస్ నాయకుడు, ఏఎస్సై లు చేసిన పనికి తనని బలి పశువు చేసారని, చేయని తప్పుకు పడ్డ నింద తట్టుకోలేకపోతున్నానని, భార్య, తండ్రికి సెల్ఫీ వీడియో పంపి పురుగుల మందు తాగిన కానిస్టేబుల్ సాగర్. భద్రాద్రి కొత్తగూడెం […]

మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబా కన్నుమూత

హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్) డిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా కన్నుమూశారు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన శనివారం(అక్టోబర్ 12) తుది శ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నక్సల్స్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో గతంలో సాయిబాబాను అరెస్టు చేశారు. దాదాపు 9 ఏళ్లపాటు ఆయన జైల్లోనే గడపాల్సి వచ్చింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై పదేళ్లు జైలు శిక్ష అనుభవించిన సాయిబాబా ఈమధ్యనే జైలు నుంచి విడుదల అయ్యారు. నక్సలైట్లతో చేతులు కలిపి […]

వ్యాపార దిగ్గజం రతన్ టాటా మృతి

హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్) ఆణువణువూ దేశభక్తి నింపుకున్న వ్యాపార దిగ్గజం రతన్ టాటా మరణ వార్త దేశ ప్రముఖులనే కాక సామాన్య ప్రజలను కూడా షాక్ కు గురి చేసింది. గత కొన్ని రోజులు ముంబయిలోని ఓ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్థరాత్రి తుది శ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత ముంబయిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వ్యాపార సామ్రాజ్యంలో […]

ఇంటి పట్టాలు పంపిణీ సంగతి చూడండి : యెర్రా కామేష్

కొత్తగూడెం (తెలంగాణ వాణి) జీ.ఓ.నెం 76 అన్ లైన్ ద్వారా ఇంటి పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికీ ఇంటి పట్టాలు మంజూరు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం పట్టణంలో ఎన్నో ఏళ్ళుగా నివాసముంటున్న వారికి యాజమాన్య హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం జీఓ 76 ప్రవేశ […]

ప్రజల మనిషి పౌరహక్కుల యోధుడు బాలగోపాల్

హైదరాబాద్ (తెలంగాణ వాణి) అక్టోబర్ 8 నేడే పౌరహక్కుల యోధుడు బాలగోపాల్ 15వ వర్ధంతి. భౌతికంగా ఆయన మన మధ్య లేనప్పటికీ ప్రజల కనీస హక్కుల సాధనకై పోరాడిన ప్రొఫెసర్ కే బాలగోపాల్ ఆశయాలు సజీవంగా మన మధ్యనే ఉన్నాయి. రైతు కూలీలు, విద్యార్థులు, కార్మిక సంఘాలు, రాజ్యాంగబద్ధమైన హక్కుల పోరాటాల్లో పాల్గొనడమే ఈ దేశంలో నేరమైంది. ప్రజల పౌర హక్కులు కాలరాయబడిన వేళ తన ఊక్కుపిడికిలి పైకిత్తి రాజ్య హింస సాగదని గుండెలెదురొడ్డి పోరాడిన యోధుడు […]

మావోయిస్టులపై కేంద్రం గురి

ఢిల్లీ (తెలంగాణ వాణి) మావోయిస్టులే టార్గెట్‎గా కేంద్ర ప్రభుత్వం వడివడిగా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ఇవాళ( సోమవారం) ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‎లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ నుంచి హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు, చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ హాజరయ్యారు. 2026 మార్చి నాటికి నక్సలిజం అంతం, అర్బన్ నక్సల్ అంశాలపై ప్రధానంగా […]

అటవీ ప్రాంతలోని గండ్రబంధం గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కూనంనేని

పాల్వంచ (తెలంగాణ వాణి) పాల్వంచ మండలంలోని కిన్నెరసాని అటవీ ప్రాంతంలో గల రహదారి కూడా లేని గడ్రబంధం గ్రామాన్ని ట్రాక్టర్ కొంత కాలినడకన ద్వారా గ్రామాన్ని చేరుకొని ఇటీవలే స్వర్గస్తులైన సిపిఐ నాయకులు మాజీ సర్పంచ్ తాటి రాధమ్మ భర్త తాటి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం కలుగజేసి తాటి వెంకటేశ్వర్లు చిత్ర పటానికి పూలమాల వేసి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా నివాళులర్పించారు. అదే […]