UPDATES  

NEWS

కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్ కాజీపేటలో అట్టహాసంగా ముగిసిన 58వ జాతీయ సీనియర్ ఖోఖో ఛాంపియన్‌షిప్ క్రీకెట్ టోర్నమెంట్ పోస్టర్ ను ఆవిష్కరించిన లక్ష్మీదేవి పల్లి ఎస్ ఐ రమణ రెడ్డి

లక్ష్మీదేవిపల్లి లో సమీక్ష సమావేశం…పనులను వేగవంతంగా పూర్తి చేయాలి: ఎంపీడీవో సుస్మితా

లక్ష్మీదేవిపల్లి మండలంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి సుస్మితా అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యదర్శులు మరియు ఉపాధి హామీ పథకం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో గ్రామాల్లో కొత్త నర్సరీల ఏర్పాటు,పారిశుద్ధ్య పనుల అమలు,మంచినీటి,పన్నుల వసూలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.సంబంధిత పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస్,వీరన్న,ఈ సి సత్యనారాణ,సెక్రెటరీ సాంబయ్య,వివిధ పంచాయతీ సెక్రటరీలు ఉపాధి హామీ పథకం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సర్పంచ్ చొరవతో పంచాయతీలో వెలిగిన దీపాలు..

పాల్వంచ : వీధులు చీకటిమయంగా లేకుండా, పిల్లలు,పెద్దలు, మహిళలు బయటకు వెళ్లాలంటే రాత్రి వేళ ఇబ్బంది లేకుండా ఉండుటకు పాల్వంచ మండలం కోడిపుంజుల వాగు గ్రామ పంచాయతీ సర్పంచ్ అజ్మీరా మహేశ్వరి శ్రీనివాస్ విధి దీపాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని విధి దీపాలను ఏర్పాటు చేయడంతో స్థానిక ప్రజలు సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వెల్లివిరిసిన యువ చైతన్యం పరిమళించిన మానవత్వం

ధర్మారం (తెలంగాణ వాణి) మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన కుడుదల కిష్టయ్య జీవనోపాధి కోసం రోజు కూలి పనులకు వెళ్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పని చేస్తున్న సమయంలో అనుకోకుండా జరిగిన ప్రమాదం అతని జీవితాన్నే అస్తవ్యస్తం చేసింది. కూలి పనిలో భాగంగా ఒకటో అంతస్తు నుండి అదుపుతప్పి కింద పడి కిష్టయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో అతని ఎడమ తొడ ఎముక పూర్తిగా విరిగిపోయి, నడవలేని స్థితికి చేరుకున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే సరైన […]

తెలంగాణలో మరో ఉపఎన్నిక

తెలంగాణలో మరో ఉపఎన్నిక కవిత రాజీనామాకు ఆమోదం   హైదరాబాద్ (తెలంగాణ వాణి) జాగృతి అధ్యక్షురాలు కవిత రాజీనామాకు ఆమోద ముద్ర పడింది. కవిత రాజీనామాను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. గతేడాది సెప్టెంబర్ 2న బీఆర్ఎస్ పార్టీ కవితను సస్పెండ్ చేసింది. ఆ వెంటనే 3వ తేదీన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కవిత ప్రకటించారు.   2022 జనవరిలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కవితకు 2028 వరకు […]

గిరిజన మహిళ ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి

అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టిన వారిపై చర్యలేవి చాతకొండ ఇసుక అక్రమ రవాణా బాధితురాలికి న్యాయం చేయండి జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్  కొత్తగూడెం (తెలంగాణ వాణి) లక్ష్మీదేవిపల్లి మండలంలోని చాతకొండ బిసి కాలనీలో ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టడమే కాకుండా గిరిజన మహిళ ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ డిమాండ్ చేశారు. […]

కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి

కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి దాస్యం వినయ్ భాస్కర్ మంత్రి కావాలి తెలంగాణ ఉద్యమకారుడు చాగంటి రమేష్ అయ్య‌ప్ప మాల విర‌మ‌ణ‌లో భాగంగా శ‌బ‌రిమ‌ల‌లో పాద‌యాత్ర‌ తెలంగాణ వాణి, ఉమ్మడి వరంగల్ బ్యూరో,(జనవరి 05) : తెలంగాణ ఉద్య‌మ‌కారుడు,వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌వ‌ర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయ‌కుడు చాగంటి ర‌మేష్ తెలంగాణ రాష్ట్ర సాధ‌కుడు కేసీఆర్ పై అభిమానాన్ని చాటుకున్నారు.అయ్యప్ప స్వామి మాల ధరించి 101 రోజు పూర్తి అయినా సందర్భంగా ఇరుముడితో శబరిమలై బయలుదేరారు.పంబా నుంచి అయ్యప్ప సన్నిధానం […]

శ్రీ చైతన్య టెక్నో ఇన్స్టిట్యూషన్ లో హ్యాపీ క్లబ్–షేరింగ్ అండ్ కేరింగ్

ఖమ్మం:ఎన్‌టీఆర్ సర్కిల్‌లోని శ్రీ చైతన్య స్కూల్–1 బ్రాంచ్‌లో విద్యార్థుల మానసిక ఉల్లాసం, పరస్పర సహకార భావన పెంపొందించే ఉద్దేశంతో హ్యాపీ క్లబ్–షేరింగ్ అండ్ కేరింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.పిల్లల్లో సామాజిక, భావోద్వేగ వికాసం సాధ్యమవుతుందని పాఠశాల యాజమాన్యం పేర్కొన్నారు.విద్యార్థులు రంగురంగుల వేషధారణలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, డీజీఎం చేతన్ మాధుర్, ప్రిన్సిపాల్ నివేదిత, వైస్ ప్రిన్సిపాల్ యాచమనేని శశాంక్‌తో పాటు అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

మాజీ సర్పంచ్ రవి ఆధ్వర్యంలో మహిళలకు ఘన సత్కారం రాయికల్ (తెలంగాణ వాణి) మహిళలు విద్య,రాజకీయ,సామాజిక సేవా రంగాల్లో రాణించాలని రామాజిపేట మాజీ సర్పంచ్,రాయికల్ ప్రెస్ క్లబ్ జేఏసీ అధ్యక్షులు వాసరి రవి అన్నారు.మండలం లోని రామాజిపేట గ్రామ రామాలయ కళ్యాణ మండపం లో మాజీ సర్పంచ్ వాసరి రవి ఆధ్వర్యంలో గ్రామం లో నూతనంగా ఎన్నికైన మహిళ వార్డు సభ్యులను,ఐకేపీ మహిళ సంఘ ప్రతినిధులను,సి.ఎ లను, ఎ.ఎన్.ఎమ్,ఆశ కార్యకర్తలను ఘనంగా సత్కరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ […]

డ్రగ్స్ తీసుకున్న ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్

హైదరాబాద్ (తెలంగాణ వాణి) రాష్ట్రంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. డ్రగ్స్ తీసుకుంటూ ఎమ్మెల్యే కుమారుడు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. హైదరాబాద్‌లోని నానక్‌రామ్ గూడలో శనివారం ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కడప జిల్లాకు చెందిన జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయారు. అదుపులోకి తీసుకున్న అనంతరం డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా.. పాజిటివ్ వచ్చింది. దీంతో సుధీర్ రెడ్డిని స్థానిక పోలీస్ స్టేసన్‌కు తరలించి […]

భట్టి విక్రమార్కను వదిలేది లేదు : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

మధిర (తెలంగాణ వాణి) బీఆర్ఎస్ – సీపీఎం కలిసి పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలవడం జీర్ణించుకోలేక భట్టి విక్రమార్క సీపీఎం కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు. పోలీసులతో కలిసి మధిర నియోజకవర్గంలో అరాచకపు పాలన కొనసాగిస్తున్నాడని ఆయన్ని వదిలేది లేదని జాన్ వెస్లి ఆగ్రహం వ్యక్తం చేశారు