UPDATES  

NEWS

 అంబేద్కర్ విగ్రహానికి మరమ్మతులు.. కొత్త రంగులు వేయించేందుకు చర్యలు

పెద్దపల్లి (తెలంగాణ వాణి): పెద్దపల్లి జిల్లా రాగినేడు గ్రామంలోని భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం చూపుడు వేలు కొంతకాలంగా దెబ్బతినడంతోపాటు విగ్రహం రంగు వెలిసిపోయింది. ఈ విషయాన్ని గ్రామ అంబేద్కర్ సంఘం నాయకులు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల జరిగిన స్వర్ణోత్సవాల సమావేశంలో ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకురాగా, స్పందించిన బాపయ్య శుక్రవారం ఆర్మూర్‌కు చెందిన శిల్పకళాకారుడు పొన్నాల పోశెట్టిని గ్రామానికి తీసుకువచ్చారు. విగ్రహం దెబ్బతిన్న చూపుడు వేలును సరిచేసి, విగ్రహానికి నూతనంగా రంగులు వేయాలని శిల్పిని కోరారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు చొప్పదండి మల్లేశం, పెరుక బానేష్, సుంచు మల్లేశం, బొల్లి నందయ్య, కొక్కుల రాంనారాయణ తదితరులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 27 November 2026, 4:46 pm Posted by : TELANGANA VANI

అంబేద్కర్ విగ్రహానికి మరమ్మతులు.. కొత్త రంగులు వేయించేందుకు చర్యలు

పెద్దపల్లి (తెలంగాణ వాణి): పెద్దపల్లి జిల్లా రాగినేడు గ్రామంలోని భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం చూపుడు వేలు కొంతకాలంగా దెబ్బతినడంతోపాటు విగ్రహం రంగు వెలిసిపోయింది. ఈ విషయాన్ని గ్రామ అంబేద్కర్ సంఘం నాయకులు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల జరిగిన స్వర్ణోత్సవాల సమావేశంలో ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకురాగా, స్పందించిన బాపయ్య శుక్రవారం ఆర్మూర్‌కు చెందిన శిల్పకళాకారుడు పొన్నాల పోశెట్టిని గ్రామానికి తీసుకువచ్చారు. విగ్రహం దెబ్బతిన్న చూపుడు వేలును సరిచేసి, విగ్రహానికి నూతనంగా రంగులు వేయాలని శిల్పిని కోరారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు చొప్పదండి మల్లేశం, పెరుక బానేష్, సుంచు మల్లేశం, బొల్లి నందయ్య, కొక్కుల రాంనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest