UPDATES  

NEWS

 పంట కోతకు వెళ్తుండగా పాము కాటు

రైతు బాల్‌రెడ్డి మృతి.. కుటుంబంలో విషాదం

—————————————–

తిమ్మాపూర్, నవంబర్ 26 (తెలంగాణ వాణి ప్రతినిధి):

—————————————–

పంట కోత పనులకు వెళ్తున్న రైతును పాము కాటు రూపంలో మృత్యువు కబళించింది. వరి కోత కోసం బావి వద్దకు వెళ్లిన రైతు పాము కాటుకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్‌లో చోటుచేసుకుంది.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఇందిరానగర్‌కు చెందిన రామంచ బాల్‌రెడ్డి (57) బుధవారం వరి కోత పనుల నిమిత్తం బావి వద్దకు వెళ్లాడు. బావి ఒడ్డున నడుస్తుండగా పాము కాటు వేసింది. అక్కడే ఉన్న ఆయన తమ్ముడు వెంటనే స్పందించి కారులో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో గురువారం బాల్‌రెడ్డి మృతి చెందాడు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.

రైతు మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 26 November 2026, 2:57 pm Posted by : TELANGANA VANI

పంట కోతకు వెళ్తుండగా పాము కాటు

రైతు బాల్‌రెడ్డి మృతి.. కుటుంబంలో విషాదం
-----------------------------------------
తిమ్మాపూర్, నవంబర్ 26 (తెలంగాణ వాణి ప్రతినిధి):
-----------------------------------------
పంట కోత పనులకు వెళ్తున్న రైతును పాము కాటు రూపంలో మృత్యువు కబళించింది. వరి కోత కోసం బావి వద్దకు వెళ్లిన రైతు పాము కాటుకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్‌లో చోటుచేసుకుంది.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఇందిరానగర్‌కు చెందిన రామంచ బాల్‌రెడ్డి (57) బుధవారం వరి కోత పనుల నిమిత్తం బావి వద్దకు వెళ్లాడు. బావి ఒడ్డున నడుస్తుండగా పాము కాటు వేసింది. అక్కడే ఉన్న ఆయన తమ్ముడు వెంటనే స్పందించి కారులో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో గురువారం బాల్‌రెడ్డి మృతి చెందాడు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.

రైతు మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest