అంబేద్కర్ విగ్రహానికి మరమ్మతులు.. కొత్త రంగులు వేయించేందుకు చర్యలు

పెద్దపల్లి (తెలంగాణ వాణి): పెద్దపల్లి జిల్లా రాగినేడు గ్రామంలోని భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం చూపుడు వేలు కొంతకాలంగా దెబ్బతినడంతోపాటు విగ్రహం రంగు వెలిసిపోయింది. ఈ విషయాన్ని గ్రామ అంబేద్కర్ సంఘం నాయకులు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల జరిగిన స్వర్ణోత్సవాల సమావేశంలో ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకురాగా, స్పందించిన బాపయ్య శుక్రవారం ఆర్మూర్‌కు చెందిన శిల్పకళాకారుడు పొన్నాల పోశెట్టిని గ్రామానికి తీసుకువచ్చారు. […]