UPDATES  

NEWS

 కేటీఆర్ పై మంత్రి అడ్లూరి ఫైర్..! ట్విట్టర్ టిల్లు అంటూ దిమ్మతిరిగే కౌంటర్

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఎక్స్ లో కేటీఆర్ చేసిన ట్వీట్ పై ఘాటుగా స్పందిస్తూ, కేటీఆర్ అహంకారాన్ని బట్టబయలు చేశారు. ప్రజలు కట్టిన పన్నులు మంత్రుల ఖర్చులకు, ఢిల్లీ ముడుపులకు సరిపోతున్నాయి” అని కేటీఆర్ ట్వీట్ చేయడం ఆయన అజ్ఞానానికి, అహంకారానికి నిదర్శనమని మంత్రి మండిపడ్డారు. రెండు సార్లు మంత్రిగా చేసి, పదేళ్లు అధికారం అనుభవించిన వ్యక్తికి ప్రభుత్వ కార్యక్రమాలకు అధికారులు నిబంధనల ప్రకారం ఖర్చు ఎలా చేస్తారో కూడా తెలియదా? అని మంత్రి సూటిగా ప్రశ్నించారు. ట్విట్టర్ లో కూర్చుని ట్వీట్లు వేయడమే తప్ప, ట్విట్టర్ టిల్లుకు పాలన అంటే ఏమిటో తెలియదని ఎద్దేవా చేశారు. మరో రెండేళ్లలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ పగటి కలలు కంటున్నారని, ఆ కలలు ఎప్పటికీ నెరవేరవని మంత్రి తేల్చి చెప్పారు. మూడేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ఒక్కరోజు కూడా గట్టిగా మాట్లాడలేదని, ప్రజల గురించి పట్టని కేటీఆర్ కు ప్రజల పన్నుల గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేటీఆర్, హరీష్ రావు కోట్ల రూపాయలు సంపాదించారనే ఆరోపణలకు ముందు సమాధానం చెప్పాలని, ఆ తర్వాతే ఇతరులపై విమర్శలు చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ సవాల్ విసిరారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 21 November 2026, 3:55 pm Posted by : TELANGANA VANI

కేటీఆర్ పై మంత్రి అడ్లూరి ఫైర్..! ట్విట్టర్ టిల్లు అంటూ దిమ్మతిరిగే కౌంటర్

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఎక్స్ లో కేటీఆర్ చేసిన ట్వీట్ పై ఘాటుగా స్పందిస్తూ, కేటీఆర్ అహంకారాన్ని బట్టబయలు చేశారు. ప్రజలు కట్టిన పన్నులు మంత్రుల ఖర్చులకు, ఢిల్లీ ముడుపులకు సరిపోతున్నాయి" అని కేటీఆర్ ట్వీట్ చేయడం ఆయన అజ్ఞానానికి, అహంకారానికి నిదర్శనమని మంత్రి మండిపడ్డారు. రెండు సార్లు మంత్రిగా చేసి, పదేళ్లు అధికారం అనుభవించిన వ్యక్తికి ప్రభుత్వ కార్యక్రమాలకు అధికారులు నిబంధనల ప్రకారం ఖర్చు ఎలా చేస్తారో కూడా తెలియదా? అని మంత్రి సూటిగా ప్రశ్నించారు. ట్విట్టర్ లో కూర్చుని ట్వీట్లు వేయడమే తప్ప, ట్విట్టర్ టిల్లుకు పాలన అంటే ఏమిటో తెలియదని ఎద్దేవా చేశారు. మరో రెండేళ్లలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ పగటి కలలు కంటున్నారని, ఆ కలలు ఎప్పటికీ నెరవేరవని మంత్రి తేల్చి చెప్పారు. మూడేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ఒక్కరోజు కూడా గట్టిగా మాట్లాడలేదని, ప్రజల గురించి పట్టని కేటీఆర్ కు ప్రజల పన్నుల గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేటీఆర్, హరీష్ రావు కోట్ల రూపాయలు సంపాదించారనే ఆరోపణలకు ముందు సమాధానం చెప్పాలని, ఆ తర్వాతే ఇతరులపై విమర్శలు చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ సవాల్ విసిరారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest