UPDATES  

 మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు

196 మందికి రూ.6.30 లక్షల జరిమానా.. వేములవాడ పట్టణ ఇన్‌స్పెక్టర్ వీరప్రసాద్ హెచ్చరిక

వేములవాడ, నవంబర్ 21 (తెలంగాణ వాణి):

మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని వేములవాడ పట్టణ ఇన్‌స్పెక్టర్ వీరప్రసాద్ హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసులు చేపడుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా పట్టుబడిన 196 మందికి కోర్టు మొత్తం రూ.6,30,000 జరిమానా విధించింది.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 196 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరందరికీ శుక్రవారం పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. కేసులను విచారించిన మేజిస్ట్రేట్ మేఘన మొత్తం రూ.6.30 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు ఇన్‌స్పెక్టర్ వీరప్రసాద్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఒక్క క్షణం నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతుందని అన్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణం కావద్దని, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టవద్దని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడితే భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

జిల్లాలో రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో నివారించేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్, వాహన తనిఖీలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అదేవిధంగా రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన PM Rahat, Rah-Veer పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు సహాయం అందించి, గోల్డెన్ అవర్‌లో వైద్యం అందేలా చూడటం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వేములవాడ ట్రాఫిక్ ఆర్‌ఎస్‌ఐ రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 21 November 2026, 10:14 am Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest