UPDATES  

 గుడులే టార్గెట్.. దొంగల ముఠా గుట్టురట్టు!

ఆలయాల్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు

ముగ్గురు నిందితుల అరెస్ట్.. రూ.7.54 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం

అశ్వాపురం (తెలంగాణ వాణి): అశ్వాపురం మండల పరిధిలోని ఓం శక్తి, సాయిబాబా ఆలయాల్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.7.54 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలం డీఎస్పీ, మణుగూరు ఇన్‌చార్జి డీఎస్పీ అరుణ్ కుమార్ గురువారం వివరాలు వెల్లడించారు.  ఈ నెల 12, 13 తేదీల మధ్య అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రెండు ఆలయాల తాళాలు పగులగొట్టి అమ్మవారి మెడలోని 105 గ్రాముల బంగారు పుస్తెల తాళ్లతో పాటు 7.9 కిలోల వెండి ఆభరణాలు, కిరీటాలు తదితర వస్తువులను అపహరించారు. ఆలయ సూపర్‌వైజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం ఉదయం గొల్లగూడెం శివారులోని సీతారామ కెనాల్ బ్రిడ్జి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు ఆలయాల్లో చోరీకి పాల్పడినట్లు అంగీకరించడంతో వారి వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.  నిందితులు షేక్ జానీ అలియాస్ జానీ షరీఫ్ (పాల్వంచ), సప్కా కాంతారావు (ఏలూరు జిల్లా), ఊర లింగయ్య (నల్గొండ జిల్లా)గా గుర్తించారు. వీరిపై గతంలో వరుసగా 11, 14, 8 చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న అశ్వాపురం పోలీసులతో పాటు సీసీఎస్ బృందాన్ని డీఎస్పీ అభినందించారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 19 November 2026, 1:30 pm Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest