చిలుకూరు అక్టోబర్ 17 (తెలంగాణ వాణి) సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలోని బాపూజీ శాఖ గ్రంధాలయానికి మండల ఆర్యవైశ్య సంఘం వారు రూ. 50 వేల విలువైన పోటీ పరీక్షల పుస్తకాలను అందజేశారు. సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు కు అందించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రంథాలయాలకు దాతలు సహకరించాలని వారు ఈ సభాముఖంగా తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు, సర్పంచ్ కొల్లు పుల్లమ్మ, ఉప సర్పంచ్ బెల్లంకొండ నాగయ్య, గ్రంథాలయం చైర్మన్ గర్నే శేషగిరిరావు, గ్రామ పెద్దలు, వివిధ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.





