- ధర్మారం, (తెలంగాణ వాణి ) 1955 లో దళితులకు ఇనాముగా ఇచ్చిన భూములను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దళితులను బెదిరించి ఈ భూములన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని బెదిరించి ఎకరానికి 1.60 లక్షల రూ”లతో 35 ఎకరాలు తక్కువ ధరకు కొనుగోలు చేశాడని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఆ పార్టీ మండల అధ్యక్షులు లావుడ్య రూప్ల నాయక్, కాంగ్రెస్ నేత దేవి జనార్దన్ బుధవారం విలేకరుల సమావేశం లో వెల్లడించారు. మంగళవారం బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..ధర్మారం మండలంలోని బొమ్మ రెడ్డి పల్లి శివారు సర్వేనెంబర్ 679లో దళితులకు చెందిన 72 ఎకరాల భూమి ఉండగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దళితులను మభ్యపెట్టి 35 ఎకరాల భూమిని కాజేచేసినట్లు అసెంబ్లీ సాక్షిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడినరాని అదంతా అవాస్తమని బిఆర్ఎస్ నాయకులు పేర్కొనడం సిగ్గుచేటని రూప్లనాయక్ పేర్కొన్నారు. 679లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు భూములే లేవని గుండెల మీద చేయి వేసుకుని చెబుతారా అని ప్రశ్నించారు. సర్వేనెంబర్ 679 లో ఉన్న భూములలో తాను వాటాదారును బాధితుడినేనని మా భూములు అతి తక్కువ ధరకు కొప్పుల ఈశ్వర్ తీసుకున్నది ముమ్మాటికి నిజమని జనార్ధన్ తెలిపారు.ఈ విషయం గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓ నాయకుడు ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడని ఇతను గతంలో ఇది భూమి వద్ద ఒక వీడియో లో కొప్పులను విమర్శిస్తూ మాట్లాడిన వీడియో తన వద్ద ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి 40 నుండి 50 లక్షలు పలికే భూములను మాజీ మంత్రి దళితులను భయభ్రాంతులకు గురిచేసి లాక్కున్నాడని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చొరవుతో నియోజకవర్గంలోని అర్హులైన దళితులకు త్వరలోనే భూ పంపిణీ కార్యక్రమాలు చేపట్టిన నొప్పి తెలిపారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు, యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సోగాల తిరుపతి, సర్పంచ్ లు వీర్పాల్, ధార రాజ్ కుమార్, మాజీ వైస్ ఎంపీపీ ఎం తిరుపతి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ లు కాడే సూర్య నారాయణ, పాలకుర్తి రాజేశం గౌడ్, మాజీ ఎంపీటీసీ తోడేటి రాజలింగయ్య, వేల్పుల నాగరాజు, నాయకులు ఈదుల శ్రీనివాస్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు తుమ్మల తిరుపతి, ఓరేం చిరంజీవి, దేవి లావణ్య, కంసాని ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.




