కరీంనగర్ జిల్లా రోడ్డు సేఫ్టీ కమిటీ మెంబర్ గా డాక్టర్ నీలం సంపత్ నియామకం

కరీంనగర్,ఆగస్టు 02 (తెలంగాణ వాణి) :గత ఇరవై సంవత్సరాలుగా రాష్టంలోని వివిధ విద్యా సంస్థల్లో,పారిశ్రామిక సంస్థల్లో,విద్యార్థులకు,అన్ని రకాల వాహనాల డ్రైవర్లకు,ప్రయాణీకులకు,పాదచారులకు,అన్ని రకాల రోడ్డు యూజర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్న రోడ్డు భద్రత కార్యకర్త,సామాజిక కార్యకర్త,విశ్రాంత అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నీలం సంపత్ ను కరీంనగర్ జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ మెంబర్ గా నియమించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై విశ్వాసంతో ఈ అవకాశాన్నిచ్చిన గౌరవ జిల్లా కలెక్టర్ కు రోడ్ సేఫ్టీ స్టేక్ హోల్డర్లయిన పోలీసుశాఖ,రహదారులు మరియు భవనాలశాఖ,వైద్య ఆరోగ్యశాఖలతో పాటు టి.జి.యస్. ఆర్.టి.సి శాఖలకు కృతజ్ఞతలను తెలియజేస్తూ కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేస్తూ వివిధ వాహనాల డ్రైవర్లతో పాటు అన్ని రకాల రోడ్ యూజర్లకు భద్రతతో కూడిన ప్రయాణాలను అందించడానికి కృషి చేస్తానని తెలియజేసారు.