UPDATES  

 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

ఇంట్లో మంచం కింద భారీగా నోట్ల కట్టలు

పెద్దపల్లి (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. పెద్దపల్లి జిల్లా మున్సిపల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కల్లేపల్లి సతీష్ కుమార్‌ను ఏసీబీ అధికారులు ఆయన నివాసంలో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సతీష్ కుమార్‌ పెద్దపల్లి పట్టణంలోని తెనుగు వాడ హిందూ శ్మశానవాటిక అభివృద్ధి, కునారం రోడ్డులోని శ్మశానవాటిక అభివృద్ధి పనులు (ప్యాకేజీ-IX) కు సంబంధించిన రూ.12,28,7 48 బిల్లును ప్రాసెస్ చేసి, ఆమోదం కోసం తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TUFIDC), హైదరాబాద్‌కు పంపేందుకు ఫిర్యాదుదారు వద్ద నుంచి రూ.2,00,000 లంచం డిమాండ్ చేశారు. ఈ మేరకు లంచం డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. అనంతరం సతీష్ కుమార్‌ ఇంట్లో నిర్వహించిన సోదాల్లో మంచం కింద లెక్కల్లో చూపని రూ.32,31,900 నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి కరీంనగర్‌లోని ఎస్పీఈ & ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరుస్తున్నారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచుతున్నట్లు ఏసీబీ తెలిపింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest