UPDATES  

NEWS

 సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం నరసింహసాగర్ గ్రామంలో రైతుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. పండించిన పంటను ఇంటికి తీసుకురావడం రైతులకు ఒక ఆనందం.అయితే అదే పంటను తీసుకెళ్తున్న సమయంలో రోడ్డు మధ్యలో ఎడ్లబండి ఇరుసు ఇరిగి పాడైపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.నరసింహసాగర్,కొత్త అంజనాపురం గ్రామ పంచాయతీల పరిధిలో దాదాపు 500 మంది రైతులు ప్రతిరోజూ తమ వ్యవసాయ పనులు కొనసాగిస్తున్నారు. కానీ సరైన రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట రవాణా చేయడానికి కూడా కష్టాలు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు.ఎన్నికల సమయంలో గ్రామాలకు వచ్చే ప్రజా ప్రతినిధులు ఇప్పుడు రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి, రోడ్డు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. త్వరలోనే ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని ప్రజా ప్రతినిది తెలిపారు.

Date of Publish : 16 May 2026, 11:48 pm Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest