UPDATES  

NEWS

సేవాలాల్ సద్గురు చూపిన మార్గం ఆదర్శనీయం: వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ పిడి బుగ్గ వెంకటేశ్వర్లు పదవీ విరమణ సందర్భంగా సన్మానించిన పి ఆర్ టి యు టి ఎస్ భద్రాద్రి జిల్లా కమిటీ హర్ష టౌన్షిప్‌లో టీఎస్ టిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ రాములు నాయక్ ఆధ్వర్యంలో మేయర్, కార్పొరేటర్‌ లకు ఘన సన్మానం లక్ష్మీదేవిపల్లిలో వీధి దీపాల ఏర్పాట్లు వేగవంతం: సర్పంచ్ తాటి అనిత 56వ డివిజన్‌లో మెగా మెడికల్ క్యాంపు..ఉచిత మందుల పంపిణీ హమాలికాలనీ గ్రామంలో కొత్త కరెంటు పోల్స్‌పై వీధి దీపాల ఏర్పాటు లక్ష్మీదేవిపల్లి బాలమేళాలో రాజాపురం పాఠశాల విద్యార్థుల ప్రతిభ ఖమ్మంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో ఘనంగా సైన్స్ దినోత్సవం ప్రజా సమస్యల పై ప్రత్యేక దృష్టి..సర్పంచ్ అజ్మీర లైలా

 హర్ష టౌన్షిప్‌లో టీఎస్ టిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ రాములు నాయక్ ఆధ్వర్యంలో మేయర్, కార్పొరేటర్‌ లకు ఘన సన్మానం

పాల్వంచ మండలం హర్ష టౌన్షిప్ లో టీఎస్ టిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ రాములు నాయక్ అధ్యక్షతన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ చౌహన్ మరియు 31వ డివిజన్ కార్పొరేటర్ నునావత్ శ్యామల దినేష్‌లకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం బానోత్ రాములు నాయక్ స్వగృహంలో జరిగింది.ఈ సందర్భంగా టౌన్షిప్‌లో నెలకొన్న సమస్యలను మేయర్ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రాన్ని అందజేశారు. దీనిపై స్పందించిన మేయర్ సంబంధిత సహాయ ఇంజనీర్‌తో చరవాణి ద్వారా మాట్లాడుతూ.. సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ,విద్యుత్ దీపాలు,రెండు పార్కుల అభివృద్ధి తదితర అంశాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించి అందజేయాలని సూచించారు. అందుకు స్పందించిన సహాయ ఇంజనీర్ ఒకటి రెండు రోజుల్లో ప్రణాళికను సమర్పిస్తానని తెలిపారు.అదనంగా హర్ష టౌన్షిప్‌లో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు అధికార యంత్రాంగంతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని మేయర్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈఓ వెంకటయ్య,ఎం.రాజయ్య, ఎల్ బి ఎం రత్నాకర్, బి.శంకర్,బి.శర్మన్,జి.శీను, అశోక్,ప్రొఫెసర్ చిన్న,జ్యోతి, గోపి,ప్రసాద్,వెంకటేశ్వర్లు, ఫారెస్ట్ రాములు, పిడి మోతిలాల్,కృష్ణ,రామకృష్ణ, నరేంద్ర,వేణు తదితర కాలనీవాసులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest