UPDATES  

NEWS

ఓణీల శుభకార్యానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించిన ఐక్య తల్లిదండ్రుల సంఘం నాయకులు. మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం : వజ్జా ఈశ్వరి మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి

 దేవిమాత మండపాలకు పట్టుచీరలు పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే

నిజామాబాద్ (తెలంగాణ వాణి ప్రతినిధి) ధన్ పాల్ లక్ష్మీబాయ్ అండ్ విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్వాడి గల్లీ డీ ఎస్ ఎన్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన పట్టుచీరాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు మరియు ట్రస్ట్ చైర్మన్ ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు దేవి నవరాత్రుల సందర్బంగా ఇందూర్ నగరంలోని దాదాపు 250 మండపాలకు పట్టుచీరలు పంపిణీ చేయడం జరిగిందన్నారు.గత 11 ఏళ్ల నుండి తన ట్రస్ట్ ద్వారా ఈ సేవ కార్యక్రమాలతో పాటు హిందూ పండుగలకు తమ వంతు సహకారం అందించడం జరుగుతుందన్నారు.హిందూ ధర్మంలో శరన్నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన్నారు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలసి ఈ పండుగను జరుపుకుంటారని అన్నారు.దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించిన సందర్బంగా ఈ పండుగను దుర్గాదేవికి అంకితం చేయబడిందని అన్నారు. హిందూ బంధువులు ఆడపడుచులు అంత ఐక్యతతో,భక్తి శ్రద్దలతో నిర్వహించే దేవి నవరాత్రులకు తమ వంతు సహకారం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు.హిందూ ధర్మరక్షణకు, హిందూ సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించడానికి ప్రతి కార్యానికి తన ట్రస్ట్ ద్వారా సేవాలాందించడానికి ముందుంటమన్నారు,అమ్మ ఆశీర్వాదం ఉంటే అన్ని ఉన్నట్లే అని రాష్ట్ర ప్రజలందరు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని రైతన్నలు సకాలంలో వర్షాలు కురిసి అధిక పంటలు పండించి సుభిక్షంగా ఉండాలన్నారు..ఈ  కార్యక్రమంలో ఏసీపీ రాజావెంకట్ రెడ్డి, ధన్ పాల్ లక్ష్మీబాయి & విఠల్ గుప్త ట్రస్ట్ సభ్యులు ఉదయ్ కుమార్, ప్రణయ్ కుమార్, బిజెపి నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest