UPDATES  

NEWS

కవిత దీక్షకు మద్దతు తెలిపిన బిరుదురాజు వెంకటేశ్వర రాజు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని సత్కరించిన ఎమ్మెల్యే కూనంనేని కేజీబీవీ,యుఆర్ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి:టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి డిఎస్.నాగేశ్వరరావు చంద్రు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ బండపల్లిలో విద్యుత్ సెగకు నిరుపేద ఇల్లు బుగ్గి: సర్వం కోల్పోయి వీధిన పడ్డ కుటుంబం కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన త్రాగిన మైకంలో యాక్సిడెంట్ చేసి ఇద్దరు మృతులకు కారణమైన అంబులెన్స్ డ్రైవర్ కు10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష కూలీలైన్ మసీదు యూత్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు టి ఎస్ యు టి ఎఫ్ అద్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం మహిళా దినోత్సవం .. రోజు మొక్కతో శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి ప్రేమికుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు హోల్డర్ విశ్వామిత్ర చౌహాన్

 జర్నలిస్టుల సంక్షేమానికి ఉద్భవించిందే డీజేయు

డీజేయు ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా వేదికగా
జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణ తరగతులు
ఇళ్లు, ఇళ్ల స్థలాలు సాధనే ధ్యేయంగా అడుగు ముందుకు వేస్తున్నాం
జర్నలిస్టుల హక్కుల సాధనకు ప్రత్యేక ఉద్యమం
డిజేయు జాతీయ కన్వీనర్ బి. లక్ష్మీనర్సింహా

కొత్తగూడెం (తెలంగాణ వాణి)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి డీజేయు యూనియన్ కృషి చేస్తుందని సీనియర్ పాత్రికేయులు సీమకుర్తి రామకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రం కొత్తగూడెం టిఎస్ యూటిఎఫ్ కార్యాలయంలో సీమకుర్తి రామకృష్ణ అధ్యక్షతన కో-ఆర్డినేటర్స్ చెంగపోగు సైదులు, అఫ్జల్ పఠాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన డెమొక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్(డిజేయు) జాతీయ కన్వీనర్ లక్ష్మీ నరసింహ మాట్లాడుతు జర్నలిస్టుల నైపుణ్యతను వెలికి తీసేందుకు డీజేయు ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తరగతులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేదికగా త్వరలోనే ఏర్పాటు చేస్తామని, జర్నలిస్టులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇళ్లు, ఇళ్ల స్థలాల సాధన లక్ష్యంగా అడుగు ముందుకు వేస్తున్నామన్నారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటం చేసేందుకు డీజేయు సిద్ధంగా ఉందన్నారు. గతంలో జర్నలిస్టుల కోసం పనిచేసిన యూనియన్లు కాలయాపన చేస్తూ సంక్షేమాన్ని వీడిందని దీన్ని దృష్టిలో పెట్టుకొని జర్నలిస్టుల కోసం డీజే యు ఉద్భవించింది అన్నారు. జర్నలిస్టులకు అవసరమైన ఇల్లు ఇళ్ల స్థలాలు సాధించేందుకు అర్హతలు బట్టి అక్రిడేషన్ కార్డుల మంజూరు, ప్రత్యేక శిక్షణ తరగతులు, తదితరవి ప్రణాళిక బద్ధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో డీజే యు ఆధ్వర్యంలో నిర్వహించనున్నామన్నారు. రానున్న రోజుల్లో జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి పని చేసే యూనియన్లను నమ్ముకోవాలని పిలుపునిచ్చారు. ఏ ఒక్కరి స్వలాభం కోసమో స్వార్థం కోసమో డీజే యు ఏర్పాటు జరగలేదని దేశవ్యాప్తంగా జర్నలిజం లో ఎంతో అనుభవం ఉన్న మేధావుల రూపకల్పనే డీజేయు అన్నారు. ప్రధానంగా దేశంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడిని ఎదుర్కొనేందుకు చట్టపరిధిలో పోరాడి ప్రత్యేక చట్టం తెచ్చేందుకు డీజేయు కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. యూనియన్ లో సభ్వత్వం ఉన్న పాత్రికేయులు ఆకస్మికంగా మరణిస్తే యూనియన్ నుండి 50 వేల రూపాయలను కుటుంబానికి అందివ్వడం జరుగుతుందని , ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో అంగవైకల్యం చెందిన జర్నలిస్టులకు ఖర్చుల నిమిత్తం 25 వేల రూపాయలను సహాయం చేస్తుందని, ఆడపిల్ల కళ్యాణ నిమిత్తం 2 లక్షల రూపాయలను డిజెయు యూనియన్ అందిస్తుందని, డిజెయు యూనియన్ నుండి 15 లక్షల హెల్త్ భీమా అందివ్వడం జరుగుతుందన్నారు. సభ్యులకు అన్ని వేళలా యూనియన్ నాయకులు అందుబాటులో ఉంటు వృత్తిపరమైన సహాయ సహకారలను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్, మౌలాలి, లక్ష్మణ్ రావు, కృష్ణ, వెంకట్, వినోద్, సతీష్, హనుమంత్, శివ రామకృష్ణ, కవటం శ్రీనివాస్, ఉమాకాంత్, సురేష్, కంచు శ్రీనివాస్, ప్రసాద్, సురేందర్, అజ్మత్, ఇమాన్యూల్, షఫీ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest