UPDATES  

NEWS

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య మండల విద్యాధికారి ప్రభాకర్ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం, ధర్నా రాస్తారోకో స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాత మధును కఠినంగా శిక్షించాలి శ్రీ చైతన్యలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు గురువులను సన్మానించిన తెడ్లపల్లి సంపత్ రావు, స్వర్ణ దంపతులు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గోశాలలో గోవులకు సేవ తుక్కుగూడ ఘటన దుర్మార్గం.. శిరీష కుటుంబానికి అండగా నిలుస్తాం మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తన.. నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష మండల స్థాయి క్రీడా పోటీలకు ఏర్పాట్లు అక్రమ అరెస్టులను నిరసిస్తూ బీజేపీ ఆందోళన

 Hyderabad airport: ప్రపంచంలోని గొప్ప విమానాశ్రయాల్లో ఇది ఒకటి.. శంషాబాద్ విమానాశ్రయంపై పీటర్సన్ ప్రశంసలు!

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen) ప్రస్తుత ఐపీఎల్ (IPL 2024) కోసం భారత్‌లో పర్యటిస్తున్నాడు. ఇటీవల బెంగళూరు విమానాశ్రయంపై ప్రశంసలు కురిపించిన పీటర్సన్ తాజాగా హైదరాబాద్ విమానాశ్రయం చూసి ముగ్ధుడయ్యాడు.

శంషాబాద్ విమానాశ్రయం నిర్వహణ తీరుపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత ఐపీఎల్‌కు పీటర్సన్ కామెంటేటర్‌గా సేవలు అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పలు మ్యాచ్‌ల కోసం భారత నగరాల్లో తిరుగుతున్నాడు (Hyderabad International Airport).

బుధవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ (SRH vs MI) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కోసం పీటర్సన్ హైదరాబాద్ వచ్చాడు. ఆ క్రమంలో హైదరాబాద్ విమానాశ్రయం చూసి ఫిదా అయ్యాడు. “మరొక రోజు.. మరొక విమానాశ్రయం. ఈ సారి నా స్నేహితులతో హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చా. ఇది మరొక అద్భుతమైన విమానాశ్రయం. ప్రపంచంలోని పలు గొప్ప విమానాశ్రయాల్లో ఇది ఒకటి. ఇక్కడి టెక్నాలజీ, పరిశుభ్రత, షాపింగ్, ఫ్రెండ్లీ నేచర్ చాలా స్వచ్ఛంగా ఉన్నాయ“ని పీటర్సన్ ట్వీట్ చేశాడు.

ప్రపంచంలోని విమానాశ్రయాలు, అతి పెద్ద విమానాశ్రయాల్లో హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ ఏడాది ఆరంభంలో ఏవియేషన్ ఎనలటిక్స్ విడుదల చేసిన జాబితాలో ఈ రెండు విమానాశ్రయాలు ఉత్తమ స్థానాలు సంపాదించాయి.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 30 March 2024, 2:04 am Posted by : TELANGANA VANI

Hyderabad airport: ప్రపంచంలోని గొప్ప విమానాశ్రయాల్లో ఇది ఒకటి.. శంషాబాద్ విమానాశ్రయంపై పీటర్సన్ ప్రశంసలు!

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen) ప్రస్తుత ఐపీఎల్ (IPL 2024) కోసం భారత్‌లో పర్యటిస్తున్నాడు. ఇటీవల బెంగళూరు విమానాశ్రయంపై ప్రశంసలు కురిపించిన పీటర్సన్ తాజాగా హైదరాబాద్ విమానాశ్రయం చూసి ముగ్ధుడయ్యాడు.

శంషాబాద్ విమానాశ్రయం నిర్వహణ తీరుపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత ఐపీఎల్‌కు పీటర్సన్ కామెంటేటర్‌గా సేవలు అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పలు మ్యాచ్‌ల కోసం భారత నగరాల్లో తిరుగుతున్నాడు (Hyderabad International Airport).

బుధవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ (SRH vs MI) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కోసం పీటర్సన్ హైదరాబాద్ వచ్చాడు. ఆ క్రమంలో హైదరాబాద్ విమానాశ్రయం చూసి ఫిదా అయ్యాడు. ``మరొక రోజు.. మరొక విమానాశ్రయం. ఈ సారి నా స్నేహితులతో హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చా. ఇది మరొక అద్భుతమైన విమానాశ్రయం. ప్రపంచంలోని పలు గొప్ప విమానాశ్రయాల్లో ఇది ఒకటి. ఇక్కడి టెక్నాలజీ, పరిశుభ్రత, షాపింగ్, ఫ్రెండ్లీ నేచర్ చాలా స్వచ్ఛంగా ఉన్నాయ``ని పీటర్సన్ ట్వీట్ చేశాడు.

ప్రపంచంలోని విమానాశ్రయాలు, అతి పెద్ద విమానాశ్రయాల్లో హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ ఏడాది ఆరంభంలో ఏవియేషన్ ఎనలటిక్స్ విడుదల చేసిన జాబితాలో ఈ రెండు విమానాశ్రయాలు ఉత్తమ స్థానాలు సంపాదించాయి.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest