UPDATES  

కొత్తగూడెం హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో గల హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు ఆధార్ సేవా కేంద్రంను ప్రారంభిస్తున్నట్లు కొత్తగూడెం పోస్ట్ మాస్టర్ ఎన్ వి ఎల్ ప్రసన్న గురువారం తెలిపారు.ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.ఆధార్ కార్డుల్లో తప్పుల సవరణలు,కొత్త ఆధార్ కార్డులను నమోదు చేయడం,తదితర సేవలు అందజేయనున్న‌ట్లు తెలిపారు. ప్రతి సవరణకు రుసుము రూ.50/- నుండి 100/~వరకు చెల్లించాల్సి ఉంటుంద‌న్నారు.