తిమ్మాపూర్, సెప్టెంబరు 3 (తెలంగాణ వాణి ప్రతినిధి): మండల స్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్–14, అండర్–17 బాలబాలికలకు వివిధ క్రీడల్లో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఎంఈవో వీ. శ్రీనివాస్ తెలిపారు. సెప్టెంబరు 7 నుంచి 9 వరకు ఎల్‌ఎండీ కాలనీ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబరు 7న బాలికలకు కబడ్డీ, కోకో, వాలీబాల్, 8న బాలురకు ఆయా క్రీడల్లో, 9న బాలబాలికలకు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. పాల్గొనే క్రీడాకారులు తమ పాఠశాల జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రంతో హాజరుకావాలని సూచించారు. ఇతర వివరాలకు మండల ఎస్‌జీఎఫ్ కార్యదర్శి, జెడ్పీహెచ్‌ఎస్ నూస్లాపూర్ పీడీ డి. శోభారాణిని సంప్రదించాలని ఎంఈవో కోరారు.
Post Views: 6



