UPDATES  

NEWS

 భారత్ సమ్మిట్‌పై బీజేపీ భగ్గు

కరీంనగర్ టౌన్ , నవంబర్ 14 (తెలంగాణ వాణి ప్రతినిధి):హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘భారత్ సమ్మిట్‌’ను వ్యతిరేకిస్తూ కరీంనగర్‌లో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయిని మల్లేశం నేతృత్వంలో శనివారం పట్టణంలోని తెలంగాణ చౌక్‌లో భారీ నిరసన చేపట్టారు. నల్లజెండాలు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాహుల్ గాంధీ రాకకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.దిష్టిబొమ్మల దహనాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. దీంతో తెలంగాణ చౌక్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు గంటపాటు సాగిన ఆందోళనతో చౌక్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశంతో పాటు సుమారు 50 మంది నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు.ఈ సందర్భంగా సాయిని మల్లేశం మాట్లాడుతూ హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నది ‘భారత్ సమ్మిట్’ కాదని, ‘దేశవ్యతిరేక సమ్మిట్’ అని విమర్శించారు. దేశ ప్రధానిని, దేశ అభివృద్ధిని అడ్డుకునే శక్తులకు, రాజ్యాంగబద్ధ సంస్థలను అగౌరవపరిచే వ్యక్తులకు హైదరాబాద్‌ను వేదికగా మార్చడం సరికాదన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించిందని ఆరోపించారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుండటంతో దృష్టి మళ్లించేందుకు ఇలాంటి సదస్సుల పేరిట రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.ఈ నిరసనలో రాష్ట్ర అధికార ప్రతినిధి వై. సునీల్ రావు, మాజీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు మాడ వెంకట్ రెడ్డి, గుజ్జ శ్రీనివాస్ రావు, కనమళ్ల గణపతి, రాష్ట్ర నాయకుడు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్లు భూపతి రవీందర్, మాసం గణేష్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు నిర్మల తదితరులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 14 November 2026, 7:30 pm Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest