ఆపదలో ఉన్న చిన్నారి భవిష్యత్తుకు భరోసా.. మానవత్వాన్ని చాటుకున్న ప్రజా ట్రస్ట్ చైర్మన్
నిర్మల్ – భైంసా, నవంబర్ 14 (తెలంగాణ వాణి ప్రతినిధి)
ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి, ఓ చిన్నారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లే మోహన్ రావు పాటిల్ తన ఉదారతను చాటుకున్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సోనారీ గ్రామానికి చెందిన దుర్గేశ్వరి అనే చిన్నారికి ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా బోస్లే మోహన్ రావు పాటిల్ మాట్లాడుతూ.. తనకు సొంత కూతురు లేకపోయినా దుర్గేశ్వరిని తన సొంత కూతురిలాగే భావిస్తున్నానని తెలిపారు. ఆ చిన్నారి భవిష్యత్తుకు తన వంతు సహాయం అందించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
కష్టాల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ, ఆపద సమయంలో ఆర్థిక సహాయం అందిస్తున్న బోస్లే మోహన్ రావు పాటిల్ సేవలు పలువురికి స్ఫూర్తినిస్తున్నాయి. రక్తసంబంధం లేకపోయినా ఆప్యాయతతో ఓ చిన్నారికి తండ్రిలా అండగా నిలవడం ద్వారా మానవత్వమే నిజమైన సేవకు నిదర్శనమని ఆయన చాటిచెప్పారు.



