UPDATES  

NEWS

 వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభమైన వరుణ యాగం

వేములవాడ,జూలై 30 (తెలంగాణ వాణి ప్రతినిధి) :

రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు, రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నిర్వహిస్తున్న మూడు రోజుల వరుణ యాగంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్,అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రులు వేములవాడలోని భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.ఆలయానికి విచ్చేసిన మంత్రులకు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్,కవ్వంపల్లి సత్యనారాయణ జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బి. గీతే పాల్గొన్నారు.మూడు రోజుల పాటు కొనసాగనున్న వరుణ యాగంలో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వేద పండితులు ప్రత్యేక హోమాలు, వేదపారాయణాలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 30 July 2026, 10:40 am Posted by : TELANGANA VANI

వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభమైన వరుణ యాగం

వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభమైన వరుణ యాగం

వేములవాడ,జూలై 30 (తెలంగాణ వాణి ప్రతినిధి) :
రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు, రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నిర్వహిస్తున్న మూడు రోజుల వరుణ యాగంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్,అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రులు వేములవాడలోని భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.ఆలయానికి విచ్చేసిన మంత్రులకు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్,కవ్వంపల్లి సత్యనారాయణ జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బి. గీతే పాల్గొన్నారు.మూడు రోజుల పాటు కొనసాగనున్న వరుణ యాగంలో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వేద పండితులు ప్రత్యేక హోమాలు, వేదపారాయణాలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest