UPDATES  

NEWS

వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా రామ భక్త శ్రీ శ్రీ శ్రీ లాలు దాస్ అందరికి ఆదర్శం రక్తదానానికి యువత ముందుకు రావాలి: డీఎస్పీ ఆదినారాయణ

 మధ్యాహ్న భోజన వంట కార్మికులకు ఆరోగ్య పరీక్షలు. 

 సైదాపూర్ : జనవరి:9 ( తెలంగాణ వాణి విలేకరి )

సైదాపూర్: ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారు చేసే వంట కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు సైదాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య పర్యవేక్షకుడు ఎస్ రమేష్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సత్పతి ప్రమేల ఆదేశాల మేరకు మండలంలోని బొమ్మకల్ గ్రామంలోని జిల్లా పరిషత్తు, పాఠశాలలో ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, మందు గోళీలు పంపిణీ చేసినట్లు తెలిపారు.

  పాఠశాలల్లో పనిచేస్తున్న వంట కార్మికుల బరువు, బిపి, షుగర్ వంటి పరీక్షలు నిర్వహించారు. అసాంక్రమిక వ్యాధుల నియంత్రణ కార్యక్రమం ద్వారా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు గ్రామాల్లో ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నియంత్రణకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా వంట కార్మికులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు పౌష్టికాహారం తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు మారుతి , ఉపాధ్యాయులు రామకృష్ణ, శ్రీనివాస్, లక్ష్మారెడ్డి వాణి, ఏఎన్ఎం సులోచన, ఆశ వర్కర్లు సుజాత, భారత తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest