UPDATES  

 పోలీసులకు సవాల్‌గా వరుస చోరీలు!

తిమ్మాపూర్‌, నవంబరు 02 (తెలంగాణ వాణి ప్రతినిధి):తిమ్మాపూర్‌ మండలంలో వరుస దొంగతనాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒకదాని వెంట మరొకటి చోటుచేసుకుంటున్న చోరీలు పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయి. గ్రామాల్లోని దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని బంగారు ఆభరణాలు, హుండీలలోని నగదును అపహరించడంతో పాటు ఇళ్లలోకి చొరబడి వృద్ధులను లక్ష్యంగా చేసుకుని వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్తున్నారనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాత్రివేళ వాహనాలపై వెళ్లేవారిని వెంబడించి చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఘటనలతో మండల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ముఖ్యంగా ఎల్‌ఎండీ పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌చార్జి ఎస్సై పాలన కొనసాగుతుండటంతో పూర్తిస్థాయి పోలీసు అధికారుల పర్యవేక్షణ కొరవడిందనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. మండలంలోని గ్రామాల్లో రాత్రివేళ గస్తీ, అనుమానితుల కదలికలపై నిఘా, దొంగతనాల నివారణ చర్యలు మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. సరిపడా పోలీసు సిబ్బంది లేకపోవడం, అందుబాటులో ఉన్న సిబ్బందిపై పని భారం అధికంగా ఉండటం కూడా వరుస చోరీలకు కారణమవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.దేవాలయాలు, ఇళ్లు, రహదారులపై ప్రయాణించే ప్రజలు.. ఇలా ఒక్కో వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నా అడ్డుకట్ట పడటం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొందని గ్రామస్థులు చెబుతున్నారు. దొంగతనాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు చోరీలకు గురైన సొత్తును తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వహించే ఎస్సైని వెంటనే నియమించాలని ప్రజలు ఉన్నతాధికారులను కోరుతున్నారు. పోలీసు సిబ్బందిని పెంచి గ్రామాల్లో నిరంతర గస్తీ ఏర్పాటు చేయాలని, రాత్రివేళ ప్రధాన రహదారులు, గ్రామాల శివారులలో నిఘా పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వరుస దొంగతనాలతో ప్రజల్లో నెలకొన్న భయాన్ని తొలగించి, తమకు భద్రతపై నమ్మకం కల్పించాల్సిన బాధ్యత పోలీసు ఉన్నతాధికారులపై ఉందని మండల ప్రజలు పేర్కొంటున్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 2 November 2026, 3:01 pm Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest