పోలీసులకు సవాల్‌గా వరుస చోరీలు!

తిమ్మాపూర్, నవంబరు 02 (తెలంగాణ వాణి ప్రతినిధి):తిమ్మాపూర్ మండలంలో వరుస దొంగతనాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒకదాని వెంట మరొకటి చోటుచేసుకుంటున్న చోరీలు పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయి. గ్రామాల్లోని దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని బంగారు ఆభరణాలు, హుండీలలోని నగదును అపహరించడంతో పాటు ఇళ్లలోకి చొరబడి వృద్ధులను లక్ష్యంగా చేసుకుని వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్తున్నారనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాత్రివేళ వాహనాలపై వెళ్లేవారిని వెంబడించి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఘటనలతో మండల […]
బంగారం కోసమేనా వృద్ధురాలి హత్య?

తిమ్మాపూర్ నవంబరు 02, (తెలంగాణ వాణి ప్రతినిధి):వృద్ధురాలి మృతి తిమ్మాపూర్ మండలం లో కలకలం రేపింది. తిమ్మాపూర్ మండలం వచ్చునూరు గ్రామానికి చెందిన ఉప్పులేటి లచ్చవ్వ (65) అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బంగారు ఆభరణాల కోసమే గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో సోమవారం గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్న విషయాన్ని […]