UPDATES  

NEWS

 తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి భర్తరఫ్ చేయాలి : యెర్రా కామేష్

కొత్తగూడెం, సెప్టెంబర్ 9 (తెలంగాణ వాణి): అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిలను వెంటనే పదవుల నుంచి భర్తరఫ్ చేయాలని జైభీమ్‌రావ్‌ భారత్‌ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్‌ డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ నాయకులతో కలిసి పోస్ట్‌ఆఫీస్‌ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కామేష్‌ మాట్లాడుతూ.. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్‌ దళిత వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అంబేద్కర్‌ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు. దళిత వర్గానికి చెందిన వ్యక్తి స్పీకర్‌గా ఉన్నందునే అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కామేష్‌ హెచ్చరించారు. కార్యక్రమంలో మాలోత్‌ వీరునాయక్‌, శంకర్‌, బాబా, రాంబాబు, కమలి, శారద తదితరులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 10 September 2026, 8:06 am Posted by : TELANGANA VANI

తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి భర్తరఫ్ చేయాలి : యెర్రా కామేష్

కొత్తగూడెం, సెప్టెంబర్ 9 (తెలంగాణ వాణి): అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిలను వెంటనే పదవుల నుంచి భర్తరఫ్ చేయాలని జైభీమ్‌రావ్‌ భారత్‌ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్‌ డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ నాయకులతో కలిసి పోస్ట్‌ఆఫీస్‌ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కామేష్‌ మాట్లాడుతూ.. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్‌ దళిత వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అంబేద్కర్‌ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు. దళిత వర్గానికి చెందిన వ్యక్తి స్పీకర్‌గా ఉన్నందునే అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కామేష్‌ హెచ్చరించారు. కార్యక్రమంలో మాలోత్‌ వీరునాయక్‌, శంకర్‌, బాబా, రాంబాబు, కమలి, శారద తదితరులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest