దళితులను అవమానించే చర్యలను సహించం

శుద్ధీకరణ పేరుతో అంటరానితనాన్ని ప్రోత్సహించడం దురదృష్టకరం: కనకం సాగర్ కరీంనగర్, సెప్టెంబర్ 9 (తెలంగాణ వాణి ప్రతినిధి): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో దళిత దండోరా కార్యక్రమం అనంతరం రోడ్లు, పరిసరాలను పసుపు, తులసి నీటితో శుద్ధి చేసినట్లు వచ్చిన వార్తలు దళితుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని కరీంనగర్ డీసీసీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కనకం విద్యాసాగర్ అన్నారు. టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు […]
పారిశుధ్య కార్మికుల పట్ల వివక్ష చూపితే ఊరుకోం : భూక్య రమేష్

కొత్తగూడెం, సెప్టెంబర్ 9 (తెలంగాణ వాణి): కొత్తగూడెం మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు గత నాలుగేళ్లుగా సబ్బులు, బట్టలు, నూనె, బెల్లం, చెప్పులు, పని పరికరాలు అందించకపోవడాన్ని నిరసిస్తూ సీఐటీయూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సెవెన్ హిల్స్ వద్ద మెరుపు ధర్నా నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న వస్తువులను వెంటనే అందించాలని కార్మికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి భూక్య రమేష్ మాట్లాడుతూ.. కార్పొరేషన్‌గా ఏర్పడిన తర్వాత సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించిన కార్మికులకు […]
తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి భర్తరఫ్ చేయాలి : యెర్రా కామేష్

కొత్తగూడెం, సెప్టెంబర్ 9 (తెలంగాణ వాణి): అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిలను వెంటనే పదవుల నుంచి భర్తరఫ్ చేయాలని జైభీమ్‌రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ నాయకులతో కలిసి పోస్ట్‌ఆఫీస్ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ.. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్షమాపణ చెప్పాలని […]
అగ్ని ప్రమాద బాధితులకు కొత్త ఇళ్లు

బండపల్లి, సెప్టెంబర్ 10 (తెలంగాణ వాణి ప్రతినిధి):అగ్ని ప్రమాదంలో ఇళ్లు కాలిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న మంజుల, శేఖర్, రజిత కుటుంబాలు ఎట్టకేలకు నూతన ఇళ్లలోకి అడుగుపెట్టారు. నూతనంగా నిర్మించిన ఇళ్లకు గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సర్పంచ్ కటకం మల్లేశం, ఉపసర్పంచ్ ఈసాక్‌తో పాటు గ్రామ పెద్దలు హాజరై బాధిత కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. అగ్ని ప్రమాదంతో సర్వం కోల్పోయిన కుటుంబాలు తిరిగి సొంతింటిలో అడుగుపెట్టడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. నూతన ఇళ్లలో […]