UPDATES  

NEWS

జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా

 గిరిజన సంక్షేమ భాషా పండితుల, వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను అప్గ్రేడ్ చేయాలి: టిపిటిఎఫ్

గిరిజన సంక్షేమ శాఖలో ద్వితీయ శ్రేణి భాషా పండితులను, వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను ఉన్నతీకరించాలని, గిరిజన సంక్షేమ పాఠశాలల, ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టిపిటిఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షులు బుటారి రాజు ప్రభుత్వాన్ని కోరారు. గత కొన్ని సంవత్సరాలుగా గిరిజన సంక్షేమ విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం వివక్షతను ప్రదర్శిస్తున్నాయని, సమస్యలపై ఎన్ని మార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడమే అందుకు నిదర్శనమని విద్యా శాఖలో మంజూరు చేసిన విధంగానే గిరిజన సంక్షేమ శాఖ భాషా పండితుల వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను అప్గ్రేట్ చేయాలని డిమాండ్ చేశారు. టిపిటిఎఫ్ తలపెట్టిన రెండో దశ పోరాట కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులు గుగులోతు హరిలాల్ అధ్యక్షతన ఐటీడీఏ భద్రాచలం కార్యాలయం ముందు తలపెట్టిన నిరసన కార్యక్రమం ఉద్దేశించి బుటారి రాజు మాట్లాడుతూ…కాంట్రాక్టు రెసిడెంట్ టీచర్లను,డైలీ వేజ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేసి, టైం స్కెళ్లను వర్తింపజేసి, మొదటి తేదీన వేతనాలు చెల్లించాలని,బదిలీలు,పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని. రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్టలను ఆశ్రమ పాఠశాలలుగా కన్వర్ట్ చేయాలని, కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలకు అదనపు సెక్షన్లకు ప్యాటర్న్ ప్రకారం సరిపడు కొత్త పోస్టులు మంజూరు చేయాలని, 317 అమలు అనంతరం మిగిలిపోయిన స్పౌస్, మెడికల్ గ్రౌండ్, స్థానికత కోల్పోయిన టీచర్లకు న్యాయం చేయాలని,ఉద్యోగులకు ఉపాధ్యాయులకు కామన్ సర్వీస్ రూల్స్ రూపొందించి, పదోన్నతులు ఇవ్వాలని,టిఆర్టి నిర్వహించి ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, అన్ని జిల్లాల్లో ఒకే విధమైన పరిపాలన, పర్యవేక్షణ, అకడమిక్ విధానం అమలు చేయాలని, అకడమిక్ పర్యవేక్షణకు విద్యా సంబంధిత అధికారులను నియమించాలి, గిరిజన ప్రాథమిక పాఠశాలలలో సర్వీస్ పర్సన్లను నియమించాలని,ఆశ్రమ పాఠశాలల లోని వసతి గృహాలకు హాస్టల్ వెల్ఫేర్ అధికారుల పోస్టులు మంజూరు చేయాలని, గిరిజన సంక్షేమ శాఖ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు హెడ్మాస్టర్ పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం ఐటీడీఏ భద్రాచలం ఏపీవో జనరల్ డేవిడ్ రాజుకు వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు జి.హరిలాల్, జె.రాంబాబు,రాష్ట్ర కౌన్సిలర్లు బి.ప్రసాదరావు, కె.మాధవరెడ్డి రాష్ట్ర అకాడమిక్ సెల్ సభ్యులు మునిగడప రామాచారి, గిరిజన ఉద్యోగుల సంఘం బాధ్యులు ఎం.ప్రతాప్ సింగ్, వివిధ మండలాల నాయకులు బి.ప్రకాష్ రావు, బి.రవి బి.వీరన్న, బి.సుందర్, మోహన్, భాస్కర్, సురేష్, కోటయ్య, వీరన్న రాంబాబు, సత్యనారాయణ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest