UPDATES  

 కారు ఢీకొని యువకుడి దుర్మరణం

రాజీవ్‌ రహదారిపై మృత్యుఘోష

అలుగునూర్‌ చౌరస్తా సమీపంలో ఘటన.. కుటుంబంలో విషాదం

తిమ్మాపూర్‌ అక్టోబర్ 14 (తెలంగాణ వాణి ప్రతినిధి ) :రాజీవ్‌ రహదారిపై రోడ్డు దాటుతున్న యువకుడిని అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం అలుగునూర్‌ చౌరస్తా సమీపంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. అలుగునూర్‌ డివిజన్‌కు చెందిన వీర్ల సదానందం (40) బుధవారం ఉదయం తన ఇంటి వద్ద నుంచి హైదరాబాద్‌ రహదారి వైపు వెళ్లేందుకు రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో కరీంనగర్‌ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి అతడిని ఢీకొట్టింది.దీంతో సదానందం రోడ్డుపై ఎగిరిపడి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎల్ ఎం డి ఎస్ ఐ అర్జున్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సదానందం మృతితో అలుగునూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 14 October 2026, 12:45 pm Posted by : TELANGANA VANI

కారు ఢీకొని యువకుడి దుర్మరణం

రాజీవ్‌ రహదారిపై మృత్యుఘోష
అలుగునూర్‌ చౌరస్తా సమీపంలో ఘటన.. కుటుంబంలో విషాదం
తిమ్మాపూర్‌ అక్టోబర్ 14 (తెలంగాణ వాణి ప్రతినిధి ) :రాజీవ్‌ రహదారిపై రోడ్డు దాటుతున్న యువకుడిని అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం అలుగునూర్‌ చౌరస్తా సమీపంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. అలుగునూర్‌ డివిజన్‌కు చెందిన వీర్ల సదానందం (40) బుధవారం ఉదయం తన ఇంటి వద్ద నుంచి హైదరాబాద్‌ రహదారి వైపు వెళ్లేందుకు రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో కరీంనగర్‌ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి అతడిని ఢీకొట్టింది.దీంతో సదానందం రోడ్డుపై ఎగిరిపడి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎల్ ఎం డి ఎస్ ఐ అర్జున్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సదానందం మృతితో అలుగునూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest