UPDATES  

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లో మహిళలు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రకృతిని ఆరాధించే ఈ పండుగ మహిళల్లో ఐక్యత, ఆత్మీయతను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో లక్ష్మీ, చంద్ర, కుమారి, సుకన్య, లలిత, ప్రమీల, పార్వతి, పద్మావతి, చందన, కవిత, జ్యోత్స్న, […]

వేములవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

వేములవాడ, అక్టోబర్ 14 (తెలంగాణ వాణి ప్రతినిధి):వేములవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బార్ అసోసియేషన్ మహిళా ప్రతినిధి తమిరి అన్నపూర్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో న్యాయమూర్తులు, మహిళా న్యాయవాదులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొని బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్ జాదవ్ మాట్లాడుతూ.. వేములవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా బతుకమ్మ వేడుకలను ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. […]

కారు ఢీకొని యువకుడి దుర్మరణం

రాజీవ్‌ రహదారిపై మృత్యుఘోష అలుగునూర్‌ చౌరస్తా సమీపంలో ఘటన.. కుటుంబంలో విషాదం తిమ్మాపూర్‌ అక్టోబర్ 14 (తెలంగాణ వాణి ప్రతినిధి ) :రాజీవ్‌ రహదారిపై రోడ్డు దాటుతున్న యువకుడిని అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం అలుగునూర్‌ చౌరస్తా సమీపంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. అలుగునూర్‌ డివిజన్‌కు చెందిన వీర్ల సదానందం (40) బుధవారం ఉదయం తన ఇంటి వద్ద నుంచి హైదరాబాద్‌ రహదారి […]