నిర్మల్ – భైంసా: నవంబర్ 29 (తెలంగాణ వాణి ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన చారిత్రాత్మక నిరాహార దీక్షకు గుర్తుగా భైంసా పట్టణంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో సాగిన ఉద్యమం వేలాది మంది ఉద్యమకారుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ముధోల్ నియోజకవర్గ నాయకులు రమాదేవి,కిరణ్ కొమ్రేవార్, విలాస్ గాదేవార్తో పాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు,బీఆర్ఎస్ నాయకులుకార్యకర్తలు పాల్గొన్నారు.



