కొత్తగూడెం:ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలో జరిగిన రాష్ట్రస్థాయి అవార్డుల కార్యక్రమంలో తెలంగాణకు చెందిన తండ్రీకూతురు ఒకే వేదికపై అవార్డులు అందుకోవడం అభినందనీయమని ప్రకృతి హరిత దీక్ష వ్యవస్థాపక అధ్యక్షులు మొక్కల కె.ఎన్. రాజశేఖర్ అన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం చెందిన ప్రముఖ రక్తదాత కన్నా,ఆయన కుమార్తె పారుల్ అవార్డులు అందుకున్నారు. కన్నా ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూనే అత్యవసర పరిస్థితుల్లో వేలాది మందికి రక్తదానం చేశారు. ఆయన కుమార్తె పారుల్ ప్రకృతి హరిత దీక్షలో భాగంగా వందలాది మొక్కలు నాటడంతో పాటు వేలాది మొక్కలను బహుమతిగా అందిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు.
పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఉమాశంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి వంగవీటి ఆశాకిరణ్ చేతుల మీదుగా తండ్రీకూతురు అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, ప్రకృతి హరిత దీక్ష గౌరవాధ్యక్షులు సంఘం వెంకట పుల్లయ్యతో పాటు పలువురు రక్తదాతలు, ప్రకృతి ప్రేమికులు, సామాజిక సేవకులు వారిని అభినందించారు.


