UPDATES  

 దేశ స్వాతంత్రాన్ని గుర్తించకపోవడం ఆర్ఎస్ఎస్ అవివేకం

దేశ స్వాతంత్రాన్ని గుర్తించకపోవడం ఆర్ఎస్ఎస్ అవివేకం
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మోహన్‌ భగవత్‌ దిష్టిబొమ్మ ఊరేగింపు

కొత్తగూడెం (తెలంగాణ వాణి) ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ కాంగ్రెస్‌ అధ్యక్షులు చీకటి కార్తీక్ ఆధ్వర్యంలో మోహన్‌ భగవత్‌ దిష్టిబొమ్మను ఊరేగించి నిరసన చేపట్టారు. భారత దేశానికి ‘నిజమైన స్వాతంత్య్రం’ అయోధ్యలో రామ మందిరం ప్రారంభమైన రోజే వచ్చిందన్న భగవత్‌ వ్యాఖ్యలు దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి ప్రాణాలు వదిలిన సమరయోధులను కించపరిచే విధంగా ఉన్నాయని తక్షణమే తన వ్యాఖ్యలు ఉపసంహారించుకుని దేశానికి క్షమాపణ చెప్పాలన్నారు. లేకుంటే యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన్ని దేశంలో తిరగనివ్వమని హెచ్చరించారు. స్వాతంత్ర సమరంలో పోరాటం చేయని ఆర్ఎస్ఎస్ వాళ్లకు చరిత్ర తెలియకపోతే గత కొన్ని సంవత్సరాలుగా ఆగస్టు 15 నాడు ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరేసేస్తున్న వాళ్ళ నాయకుడు, ప్రధానమంత్రి మోడీ ని అడిగి తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో పోరాటలు చేసి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిందని, దీన్ని ప్రపంచం గుర్తించిందని కానీ ఆర్ఎస్ఎస్ గుర్తించకాపోడం వాళ్ళ అవివేకానికి నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పాల సత్యనారాయణ రెడ్డి, జిల్లా జనరల్ సక్రెటరీలు గులాం మతిన్, కుంచం వెంకటేష్, పల్లి ప్రణయ్, తాటి పవన్, కసనబోయిన రామూర్తి, (రాము) కొత్తగూడెం టౌన్ ప్రేసిడెంట్ మద్దెల జయ సూర్య, చుంచుపల్లి మండలం ప్రేసిడెంట్ అంతడుపుల శివ కుమార్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ అల్లెపు రాజు, సాయి ప్రకాష్, పాల్వంచ రూరల్ ప్రెసిడెంట్ మెలిగ మహేష్, లక్ష్మిదేవిపల్లి మండలం సెక్రటరీ జీడీ మహేష్, అశ్వారావుపేట అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్, నవీన్, సందీప్ మాలోత్ విఘ్నేష్ నాయక్, షేక్ షఫీ మరియు తదితరులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 17 January 2025, 4:51 pm Posted by : TELANGANA VANI

దేశ స్వాతంత్రాన్ని గుర్తించకపోవడం ఆర్ఎస్ఎస్ అవివేకం

దేశ స్వాతంత్రాన్ని గుర్తించకపోవడం ఆర్ఎస్ఎస్ అవివేకం
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మోహన్‌ భగవత్‌ దిష్టిబొమ్మ ఊరేగింపు
కొత్తగూడెం (తెలంగాణ వాణి) ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ కాంగ్రెస్‌ అధ్యక్షులు చీకటి కార్తీక్ ఆధ్వర్యంలో మోహన్‌ భగవత్‌ దిష్టిబొమ్మను ఊరేగించి నిరసన చేపట్టారు. భారత దేశానికి 'నిజమైన స్వాతంత్య్రం' అయోధ్యలో రామ మందిరం ప్రారంభమైన రోజే వచ్చిందన్న భగవత్‌ వ్యాఖ్యలు దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి ప్రాణాలు వదిలిన సమరయోధులను కించపరిచే విధంగా ఉన్నాయని తక్షణమే తన వ్యాఖ్యలు ఉపసంహారించుకుని దేశానికి క్షమాపణ చెప్పాలన్నారు. లేకుంటే యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన్ని దేశంలో తిరగనివ్వమని హెచ్చరించారు. స్వాతంత్ర సమరంలో పోరాటం చేయని ఆర్ఎస్ఎస్ వాళ్లకు చరిత్ర తెలియకపోతే గత కొన్ని సంవత్సరాలుగా ఆగస్టు 15 నాడు ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరేసేస్తున్న వాళ్ళ నాయకుడు, ప్రధానమంత్రి మోడీ ని అడిగి తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో పోరాటలు చేసి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిందని, దీన్ని ప్రపంచం గుర్తించిందని కానీ ఆర్ఎస్ఎస్ గుర్తించకాపోడం వాళ్ళ అవివేకానికి నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పాల సత్యనారాయణ రెడ్డి, జిల్లా జనరల్ సక్రెటరీలు గులాం మతిన్, కుంచం వెంకటేష్, పల్లి ప్రణయ్, తాటి పవన్, కసనబోయిన రామూర్తి, (రాము) కొత్తగూడెం టౌన్ ప్రేసిడెంట్ మద్దెల జయ సూర్య, చుంచుపల్లి మండలం ప్రేసిడెంట్ అంతడుపుల శివ కుమార్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ అల్లెపు రాజు, సాయి ప్రకాష్, పాల్వంచ రూరల్ ప్రెసిడెంట్ మెలిగ మహేష్, లక్ష్మిదేవిపల్లి మండలం సెక్రటరీ జీడీ మహేష్, అశ్వారావుపేట అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్, నవీన్, సందీప్ మాలోత్ విఘ్నేష్ నాయక్, షేక్ షఫీ మరియు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest