గ్రామసభలో ఆత్మహత్యాయత్నం చేసిన మాజీ సర్పంచ్
అడ్డుకున్న పోలీసులు
మల్లాపూర్ (తెలంగాణ వాణి)
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేటలో నిర్వహిస్తున్న ప్రధాన పథకాల గ్రామసభలో మాజీ సర్పంచ్ వనతలుపుల నాగరాజు పెట్రోల్ పోసుకోని ఆత్మహత్యయత్నం చేశారు. అక్కడే విధుల్లో ఉన్న ఎస్ఐ కె.రాజు మాజీ సర్పంచ్ నాగరాజును అదుపులోకి తీసుకొని మల్లాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదే విషయమై తాజా మాజీ సర్పంచ్ నాగరాజును వివరణ కోరగా పెండింగ్ బిల్లులు దాదాపు 20 లక్షల రూపాయలు రావాల్సి ఉన్నాయని వాటిని వెంటనే చెల్లించాలని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారికి మాత్రమే పథకాలను అమలు చేసే విధంగా ఈ గ్రామ సభను నిర్వహించారని అందుకే గ్రామసభను బాయ్ కాట్ చేస్తూ పెట్రోల్ పోసుకున్నానని నాగరాజు తెలిపారు.
Post Views: 1,655