UPDATES  

 రాజారాంపల్లిలో విషాదం.. విద్యుత్‌ షాక్‌తో చిన్నారి దుర్మరణం

చార్జింగ్‌లో ఉన్న తూకం యంత్రాన్ని తాకి 10 నెలల పాప మృతి

ఎండపల్లి, నవంబర్ 6 (తెలంగాణ వాణి) లోకాన్ని పూర్తిగా చూడకముందే విద్యుత్‌ రూపంలో మృత్యువు పసిపాపను కబళించింది. ఇంట్లో ఆడుకుంటున్న 10 నెలల చిన్నారి విద్యుత్‌ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన విభూది ఆద్య అనే 10 నెలల పాప శుక్రవారం ఇంట్లో ఆడుకుంటుండగా, చార్జింగ్‌లో ఉన్న ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రాన్ని అనుకోకుండా తాకింది. దీంతో విద్యుత్‌ షాక్‌కు గురై చిన్నారి స్పృహ కోల్పోయి పడిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి పాపను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు సమాచారం. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పసిపాప ఆకస్మిక మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో రాజారాంపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, విద్యుత్‌ పరికరంలో తలెత్తిన సాంకేతిక లోపాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 6 November 2026, 11:26 am Posted by : TELANGANA VANI

రాజారాంపల్లిలో విషాదం.. విద్యుత్‌ షాక్‌తో చిన్నారి దుర్మరణం

చార్జింగ్‌లో ఉన్న తూకం యంత్రాన్ని తాకి 10 నెలల పాప మృతి

ఎండపల్లి, నవంబర్ 6 (తెలంగాణ వాణి) లోకాన్ని పూర్తిగా చూడకముందే విద్యుత్‌ రూపంలో మృత్యువు పసిపాపను కబళించింది. ఇంట్లో ఆడుకుంటున్న 10 నెలల చిన్నారి విద్యుత్‌ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన విభూది ఆద్య అనే 10 నెలల పాప శుక్రవారం ఇంట్లో ఆడుకుంటుండగా, చార్జింగ్‌లో ఉన్న ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రాన్ని అనుకోకుండా తాకింది. దీంతో విద్యుత్‌ షాక్‌కు గురై చిన్నారి స్పృహ కోల్పోయి పడిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి పాపను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు సమాచారం. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పసిపాప ఆకస్మిక మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో రాజారాంపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, విద్యుత్‌ పరికరంలో తలెత్తిన సాంకేతిక లోపాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest