UPDATES  

NEWS

చిరుత చర్మం.. 17 గోర్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్ రాజ్ జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్ జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి

 బొమ్మరెడ్డిపల్లి లో టీబి ఛాంపియన్ అవగాహన కార్యక్రమం

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని బొమ్మ రెడ్డిపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నంది మేడారం ఆధ్వర్యంలో టీబి ఛాంపియన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్యాధికారి డాక్టర్ వాణిశ్రీ హాజరు కాగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సుస్మిత, డాక్టర్ అనుదీప్ ఆధ్వర్యంలో ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్ట్, టిబి అలర్ట్ ఇంపాక్ట్ఇండియా పెద్దపెల్లి జిల్లా ఇంప్లిమెంటేషన్ లీడ్ డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీబి చాంపియన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టీబీ చాంపియన్ వాణి టీబీ లక్షణాల గురించి, టిబి ఎలా సోకుతుంది,టీబీ త్వరగా గుర్తించడం గురించి,టిబి వ్యాధి చికిత్స, డిబిటి, పోషకాహార కిట్ల గురించి ప్రజలకు తెలిపారు.

వ్యాధి సోకే అవకాశం కలిగిన ఆరు రకాల ప్రజలను గుర్తించి వారికి అవసరమైన తెమడ పరీక్షలు,ఎక్స్రేలు, ఇతరత్రా పరీక్షలు నిర్వహించడానికి ప్రజలందరూ సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొని మన గ్రామాన్ని టీబీ రహిత గ్రామంగా తీర్చి దిద్దడానికై ప్రజలందరూ అవగాహనతో ముందుండాలని కోరినారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గౌతమ్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వేముల వసంత, హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నరసింహారెడ్డి, హెల్త్ సూపర్వైజర్ దేవి జయ, హెల్త్ అసిస్టెంట్ దామోదర్ రెడ్డి, ఏఎన్ఎం అరుంధతి, ఆశా కార్యకర్తలు మంజుల, మల్లీశ్వరి, లలిత, ప్రభుత్వ టీచర్ పిఎన్ఆర్ శర్మ, అంగన్వాడి టీచర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినారు.

[post_to_image]

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest