కొత్తగూడెం (తెలంగాణ వాణి)
రేపు కొత్తగూడెంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు కొట్టి వెంకటేశ్వర రావు తెలిపారు. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆదేశాల మేరకు కొత్తగూడెం తెలంగాణ భవన్ లో జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధుసూధన్, మాజీమంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, జిల్లా స్థాయి నాయకులు హాజరవుతున్నారు. టిబిజికేఎస్, బిఆర్ టియు, బిఆర్ఎస్వి, బిఆర్ఎస్ యువజన, బిఆర్ఎస్ పార్టీ అనుబంధ శాఖల ముఖ్య నాయకులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ లక్ష్మిదేవిపల్లి మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర రావు పిలుపునిచ్చారు.