UPDATES  

NEWS

రచ్చపల్లిలో ఆర్థిక, సాంకేతిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం సి.పి.ఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్ తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇస్తున్నా ప్రజలు కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు

 ఈటెల రాజేందర్ కొత్తగూడెం పర్యటన వాయిదాకు కారణమేంటి

జిల్లా నాయకుల మధ్య విభేదాలా ?

అగ్రకుల నాయకుల రాజీనామా బెదిరింపులా ?

కొత్తగూడెం (తెలంగాణ వాణి)

అగ్రకులాల బెదిరింపులతో బీసీ వర్గానికి చెందిన ఓ ఎంపీ గొంతు మూగబోయిందా. ఇప్పుడు ఇదే విషయం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో చర్చనియాంశంగా మారింది. బీజేపీ జిల్లా పార్టీలో ఇలాంటి ఘటనల వల్ల పార్టీ పరువు పోవడం ఖాయమన్న సంగతి కూడ మర్చిపోయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీసీ గొంతుక, జాతీయ నాయకుడు, మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గొంతును భద్రాద్రి జిల్లాలో వినపడకుండా చేసారని పార్టీ నేతలు కొందరు బహిరంగంగా విమర్శిస్తున్నారు. బీసీ అగ్రనేతకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సాధారణ బహుజనుల పరిస్థితి ఏమిటని నిలదీస్తున్నారు. రాజీనామా చేస్తామన్న కొందరు అగ్రకుల నాయకుల మాటకు విలువిచ్చి ఈటెల పర్యటనను మార్చేసిన పార్టీ అధిష్టానంపై భద్రాద్రి బహుజన నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest