బహిరంగ ప్రదేశాల్లో వధిస్తున్న చోద్యం చూస్తున్న అధికారులు
కోదాడ (తెలంగాణ వాణి)
పట్టణ పరిధిలో పట్టపగలు నడి రోడ్డు మీదనే ఆవులను వధిస్తున్నారు. పట్టణంలో ఆవుని కోసిన ఒక సంఘటనలో ఇరుగు పొరుగున నివాసం ఉన్న వ్యక్తులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కమీషనర్ దిగువ అధికారులకు చెప్పి, అంతటితో తన బాధ్యత పూర్తయినట్లు వ్యవహరించారని ఆరోపిస్తున్నారు.ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేశారని తెలిసి ఆవుని “వధించిన వారు” ఫిర్యాదు చేసిన కుటుంబంలోని మహిళల మీద దాడి చేశారని, దాంతో వారు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ నేటి వరకు పోలీస్ లు స్పందించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. చట్ట విరుద్ద పనులను నిరోధించాల్సిన మున్సిపల్, పోలీస్ స్థానిక అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తూ, మరోప్రక్కన స్వచ్చందంగా బాధ్యత గల పౌరులుగా ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక అధికారులు స్పందించకుంటే సమాజంలో ఘర్షణలు మరింతగా పెరిగే ప్రమాదం ఉన్నదని తెలుగు రైతు సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత వ్యక్తులపై పూర్తి విచారణ చేపట్టి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మున్సిపల్, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని, ముఖ్యంగా కోదాడలో ఆవుల వధను తక్షణమే ఆపాలని విజ్ఞప్తి చేసారు.