పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్
కరీంనగర్ (తెలంగాణ వాణి)
టేకమెట్ల గ్రామాన్ని చుట్టుముట్టి మయాంద్ర సోధి, సోడి రాజ్ కుమార్, దేవా బార్సే, ఉర్ర కుంజమ్ నలుగురిని అరెస్టు చేసి ఉసూరు పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారని తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణ రావు తెలిపారు. నలుగురు ఆదివాసీలను పోలీసు బలగాలను ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించగా మహిళలు, గ్రామస్తులపై బలగాలు బెదిరింపులకు గురి చేసారని నలుగురు వ్యక్తులకు పోలీసు బలగాలు ఆధీనంలోకి తీసుకోవడంతో ప్రాణహాని తలపెట్టే అవకాశాలు ఆందోళన చెందుతున్నా రని, ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తూ డబల్ ఇంజన్ సర్కార్ చతీసుషుడ్ రాష్ట్రంలో ఆదివాసుల హక్కులు జీవించే హక్కు హరిస్తూ అడవిలో ఆది వాసులపై అప్రకటిత ఎమర్జెన్సీ అమలుపరుస్తున్నా యన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న నలుగురు ఆదివాసి లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.