జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్
గంగారెడ్డి హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు
జగిత్యాల (తెలంగాణ వాణి)
తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని గంగారెడ్డి హత్యతో నాకెలాంటి సంబంధం లేదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ విలేఖరులతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఇప్పుడు పార్టీ ఫిరాయింపులని మాట్లాడుతున్నారని, ఇప్పటికీ కూడా నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే జగిత్యాల నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనేదే తన ఆలోచన అని అన్నారు. నియోజక వర్గంలో రెండు రోజుల నుండి జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరమని తెలిపారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గంగారెడ్డి హత్య బాధాకరమని దీన్ని తీవ్రంగాఖండిస్తు న్నానన్నారు. హత్యను సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజకీయం చేయడం బాధాకరమని వెల్లడించారు. గంగారెడ్డి హత్యకేసులో తన పక్కనున్న వారితో పాటు తన హస్తం ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడించడం దురదృష్టకరమని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ఫిరాయింపుల రాజకీయాలు మాట్లాడుతున్న జీవన్ రెడ్డిది ఎలాంటి చరిత్రనో అందరికీ తెలుసునని గుర్తు చేశారు. నాడు కాంగ్రెస్ ను తిడుతూనే రాజకీయాల్లోకి వచ్చిన చరిత్ర జీవన్ రెడ్డిదని, ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రయిన నాదెండ్ల భాస్కర్ రావుతో కలిసి మళ్లీ పార్టీ ఫిరాయించి, ఆనాడు ఎన్టీఆర్ ను జీవన్ రెడ్డి ఏకాకిని చేసిండని ఆయన ఆరోపించారు. స్వాతంత్ర్యం రాక ముందు నుంచే మేం కాంగ్రెస్ వాదులం, కాంగ్రెస్ కార్యాలయం కేంద్ర బిందువు మా ఇల్లు, కుటుంబమని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు.
Post Views: 347