ఇండ్ల స్థలాల కోసం కదం తొక్కిన విలేకరులు
మద్దతు తెలుపుతున్న వివిధ సంఘాల నాయకులు
కొత్తగూడెం (తెలంగాణ వాణి)
కొత్తగూడెం జర్నలిస్టు కాలనీ, కొత్తగూడెం పట్టణంలోని గంగా బీషన్ బస్తి రైతు వేదిక సమీపంలో జర్నలిస్టులకు గతంలో కేటాయించిన స్థలాన్ని జర్నలిస్టు లకు అప్పగించాలని ఇళ్లస్థలాల పోరాట ఉద్యమం ప్రారంభమైంది. మండు టెండను సైతం లెక్కచేయకుండా జర్నలిస్టు మిత్రులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. జర్నలిస్ట్ ఇండ్ల స్థలాల కోసం నిరసన దిక్ష చేస్తున్న జర్నలిస్ట్ లు సాక్షి జునుమాల రమేష్, ఆంధ్ర జ్యోతి కాల్లోజీ శ్రీను, సాక్షి శేఖర్, ఈనాడు కుమార్, ఆంధ్ర జ్యోతి తారక్, సీనియర్ రిపోర్టర్ లోగాని శ్రీనివాస్, టీ న్యూస్ రవి, నమస్తే తెలంగాణ ప్రవీణ్, ఆంధ్రప్రభ లక్ష్మణ్, సాక్షి కృష్ణారావు, Zee తెలుగు న్యూస్ శేఖర్, మనతెలంగాణ రాజశేఖర్, నమస్తే తెలంగాణ వీరు నాయక్, ప్రజాప్రశ్న అఫ్జల్ పఠాన్, ఆంధ్రజ్యోతి ఏలూరి శ్రీనివాస్, నమస్తే తెలంగాణ ఈశ్వర్, ఆదాబ్ హైదరాబాద్ శ్రీనివాస్, భారత్ టుడే పిట్టల రమేష్, రాజ్ న్యూస్ ఆనంద్, విజన్ ఆంధ్ర చిరంజీవి, బీర రవి, దిశ ఖాజా , సూర్య నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.