UPDATES  

NEWS

జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్ జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 అనుమతులు లేని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రులను మంగళవారం ఇలా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రులలో అందించే వైద్య సేవలు ప్రోటోకాల్ బేసిడ్ వైద్యం, ఫైర్ సేఫ్టీ, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఆరా తీశారు. మండల కేంద్రంలోని సాయిరాం హాస్పిటల్, కాస్మోడెంట్ డెంటల్ క్లినిక్ తనిఖీ చేసి ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా నిర్వహిస్తున్నారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి వీరిద్దరికి నోటీసులు అందిస్తామని తెలిపారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆక్ట్ ప్రకారం ప్రతి ఒక్క ఆసుపత్రి, అల్లోపతి, హోమియో యునాని ,ఆయుర్వేద డెంటల్, ఫిజియోథెరపీ ఎవరైనా సరే వైద్య ఆరోగ్యశాఖలో తమ వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే నిర్వహించాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉపాధికారి డాక్టర్ శ్రీరాములు, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు ఆమె వెంట ఉన్నారు.

Editor Reporter
telanganavanidaily.com

Share ePaper Clip

Preparing image...

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest