నాగార్జున “ఎన్” కన్వెన్షన్ కూల్చివేత…

హైడ్రా దృష్టిలో సినీ, రాజకీయ, బడబాబులు ఎవరైనా ఒక్కటే అంటున్న రంగనాధ్ హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్) హైదరాబాద్‌లో గత కొన్నిరోజులుగా అక్రమ కట్టడాల మీద హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) స్పెషల్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్ తుమ్మిడి చెరువులో నటుడు నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను హైడ్రా అధికారులు ప్రారంభించారు. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేతను నిర్వహిస్తున్నారు. […]
నా ఇల్లు అక్రమమైతే మీరే కూల్చేయండి

కేటీఆర్‌కు పొంగులేటి సవాల్ హైదరాబాద్ (తెలంగాణ వాణి) హిమాయత్ సాగర్ బఫర్ జోన్‌లో తన ఇల్లు ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించడంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మండిపడ్డారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తన ఇల్లు ఇంచు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నా టేప్ పెట్టి కొలిచి కూలగొట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ని కోరారు. దమ్ముంటే కేటీఆర్, హరీశ్ రావు తన ఇల్లు FTL, బఫర్ జోన్‌లో ఉందని నిరూపించాలని ఛాలెంజ్ విసిరారు. […]
2 కోట్ల రూపాయలతో చిల్డ్రన్స్ పార్క్ అభివృద్ధి

హన్మకొండ (తెలంగాణ వాణి) హనుమకొండ జిల్లా బాలసముద్రం చిల్డ్రన్ పార్కు అభివృద్ధి పనులకు రెండు కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, కూడ చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి ,పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, ప్రభుత్వ అధికారులు ,కూడా అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
జబ్బార్ మృతి తీరని లోటు

జబ్బార్ చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి సీతక్క ములుగు (తెలంగాణ వాణి) రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ములుగు మండలం లోని జగ్గన్న పేట గ్రామానికి చెందిన మంత్రి సీతక్క వ్యక్తిగత సహాయకుడుగా పని చేసి ఇటీవల మరణించిన కొట్టేం వెంకటనారాయణ (జబ్బార్) ప్రథమ వర్ధంతి కి హాజరై ఆయన చిత్ర పటం వద్ద నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు […]
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క

ములుగు (తెలంగాణ వాణి) ములుగు పట్టణ కేంద్రానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు చిందం చందు తండ్రి చిందం రవీందర్ ప్రథమ వర్ధంతి కి హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క రవీందర్ చిత్ర పటానికి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, గ్రామ, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లి దేవాలయంలో వనమా రాఘవ ప్రత్యేక పూజలు

పాల్వంచ (తెలంగాణ వాణి) పాల్వంచ మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామంలోని శ్రీకనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మతల్లి దేవాలయం) లో వనమా రాఘవేంద్రరావు పూజలు చేశారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వనమా రాఘవ వెంట BRSV కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షులు బత్తుల మధుచంద్, పాల్వంచ BRS మండల అధ్యక్షులు మల్లెల శ్రీరామ్మూర్తి, వాసుమల్ల గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
అలీ కుటుంబాన్ని పరమర్శించిన మాజీ ఎమ్మెల్యే

బెల్లంపల్లి (తెలంగాణ వాణి) బెల్లంపల్లి బిఆర్ఎస్ పట్టణ మైనార్టీ ఉపాధ్యక్షులు అలి తల్లి అనారోగ్యంతో బాధప డుతు ఇటీవలే మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజి మంత్రి బోడజనార్ధన్,మాజి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మున్సి పల్ వైస్ చైర్మన్ సుదర్శన్ లు గురువారం ఆయన కుటుంబాన్ని పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా పలువురు పట్టణ కాంగ్రెస్ నాయకులు, బిజెపి నాయకులు, జనహిత సేవా సమితి సంస్థ సభ్యులు, పలు సంఘాల నాయ కులు, బెల్లంపల్లి వ్యాపార వర్తకులు, […]
ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలి : మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు

భీమదేవరపల్లి (తెలంగాణ వాణి) తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని టిఆర్ఎస్ పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు మండల సురేందర్ ఆధ్వర్యంలో ముల్కనూర్ లో దర్న నిర్వహించడం అయినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు పాల్గొని వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి రైతుల రుణమాఫీ భాగంలో 48 వేల కోట్ల బడ్జెట్లో రైతులందరికీ రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి ఇప్పుడు ఆంక్షలు విధించి […]
మోడీ నాయకత్వమే ఈ దేశానికి శ్రీ రామ రక్షా

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వమే ఈ దేశానికి శ్రీ రామ రక్షా అని అన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో డీకే అరుణ ఆధ్వర్యం లో వెయ్యి మంది కార్యకర్తలు పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఐదో సంపన్న దేశంగా భారత దేశాన్ని ఉంచిన ఘనత ప్రధాని మోడీ ది అని, […]
ధరణి పోర్టల్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. రద్దు చేయనున్నారా లేక?

భూ రికార్డులకు సంబంధించిన ధరణి పోర్టల్‌పై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ధరణి పెండింగ్ దరఖాస్తులకు వెంటనే పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారంలోనే ఏర్పాట్లు చేయాలని, మెరుగైన రెవిన్యూ రికార్డుల నిర్వహణకు చట్ట సవరణ చేయాలని పేర్కొన్నారు. ధరణి పోర్టల్ ఏజెన్సీపై సమగ్ర విచారణకు ఆదేశించారు. అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ధరణి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులకు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 2.45 […]