UPDATES  

 ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలి : మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు

భీమదేవరపల్లి (తెలంగాణ వాణి)

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని టిఆర్ఎస్ పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు మండల సురేందర్ ఆధ్వర్యంలో ముల్కనూర్ లో దర్న నిర్వహించడం అయినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు పాల్గొని వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి రైతుల రుణమాఫీ భాగంలో 48 వేల కోట్ల బడ్జెట్లో రైతులందరికీ రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి ఇప్పుడు ఆంక్షలు విధించి రుణమాఫీ చేయక రైతుల నడ్డి విరుస్తున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతును కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు, కౌలు రైతులకు,రైతు భరోసా, మహిళలకు 2500 రూపాయల ఊసే లేదని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో రైతు సమస్యలపై అందుబాటులో ఉంటూ రైతులకు వెన్నంటి ధర్నాలు కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జక్కుల అనిత, సంఘ సంపత్, మాజీ జడ్పీటీసీ వంగ రవి, గ్రామ శాఖ అధ్యక్షులు శనిగరం సదానందం , మహిళ అధ్యక్షురాలు ఏనుగు సత్యవతి, మాజీ సర్పంచ్ లు సల్పాల తిరుపతి, కొత్తకొండ మొగిలి, సీనియర్ నాయకులు జక్కుల రమేష్, మాడుగుల అశోక్, ధార్న శ్రీనివాస్, ఎల్తూరి ప్రభాకర్, గద్ద కుమారస్వామి, రజనాచారి, తాళ్లపల్లి జయంత్, బిఆర్ఎస్ పార్టీకార్యకర్తలు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest