మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదు

నాకు ప్రాణహాని ఉందంటున్న చక్రధర్ గౌడ్ హైదరాబాద్ (తెలంగాణ వాణి) బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదు అయింది. బాచుపల్లి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. హరీష్ రావు, ఆయన అనుచరులు బెదిరిస్తున్నారని కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏ -1 గా వంశీ కృష్ణ, ఏ -2 గా హరీష్ రావు, ఏ-3 సంతోష్ కుమార్, ఏ […]
ఓటు హక్కును వినియోగించుకున్న కలెక్టర్

నిజామాబాద్ (తెలంగాణ వాణి) నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల ఎస్.ఎఫ్.ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ నెం 122 లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఓటు వేశారు. ప్రజాస్వామ్య ప్రాముఖ్యతను గుర్తిస్తూ, ఓటు కలిగిన ప్రతి ఒక్కరు తమ ఓటు […]
రాష్ట్ర స్థాయి కబడ్డీ విజేతగా భద్రాద్రి జిల్లా బాలికల జట్టు

క్రీడాకారులను అభినందించిన కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్ వికారాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 34వ సబ్ జూనియర్ అంతర్రాష్ట్ర బాలబాలికల కబడ్డీ చాంపియన్ షిప్ పోటీల్లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జట్టు సత్తా చాటింది. కాగా బాలికల జట్టును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ చీకటి కార్తీక్ అభినందించారు. వారికి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా […]
పసుపుకు మద్దతు ధర ప్రకటించకపోతే జిల్లా కలెక్టరేట్ ను ముట్టడిస్తాం

మార్కెట్ యార్డ్ ని సందర్శించిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ (తెలంగాణ వాణి) ఈనెల ఆఖరి వరకు పసుపు రైతులకు మద్దతు ధర 12 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పసుపు రైతులతో పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని ఎమ్మెల్సీ కవిత అన్నారు.. ఈ మేరకు శనివారం పసుపు రైతులతో కలిసి నిజామాబాద్ మార్కెట్ యార్డ్ ని సందర్శించారు. పసుపు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె […]
యశోదలో అరుదైన శస్త్ర చికిత్స

నిజామాబాద్ (తెలంగాణ వాణి) సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ వైద్యులు నమ్మశక్యం కాని అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారని యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ కెఎస్ కిరణ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని యశోద హాస్పిటల్ కేర్ సెంటర్ లో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. యశోద హాస్పిటల్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ కిరణ్ శాస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందిన ఫర్జానా బేగం అనే 52 సంవత్సరముల వయస్సుగల […]
జర్నలిస్టులకు అండగా ఉంటా : ఎంపీ ధర్మపురి అరవింద్

నిజామాబాద్ (తెలంగాణ వాణి) ప్రజల కోసం పనిచేస్తున్న జర్నలిస్టులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఎంపీ ధర్మపురి అరవింద్. జర్నలిస్టుల వరుస మరణాలు బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఒత్తిడులు తగ్గించుకుంటు జర్నలిస్టులు ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. జిల్లాకు పసుపు బోర్డు సాధించిన తర్వాత తొలిసారిగా నిజామాబాద్ లో పర్యటించిన అరవింద్ ను జర్నలిస్టులు మర్యాద పూర్వకంగా కలిశారు. సుభాష్ నగర్ లోని తన నివాసంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జిల్లాలో తాజా రాజకీయ […]
సెల్ టవర్ ఎక్కి ఆత్మ హత్యయత్నం

సైదాపూర్ (తెలంగాణ వాణి) మండలంలోని ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన దుర్గం కనుకయ్య కుటుంబ కలహాలతో శంకరపట్నం మండలంలో సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ లు వచ్చి సముదాయించగా సెల్ టవర్ నుండి దిగాడు. దీనికి సంబందించిన వివరాల్లోకి వెళ్తే దుర్గం కనుకయ్య కు అతని చిన్న సోదరుడు తిరుపతికి కనుకయ్యకు మధ్య గత కొంత కాలంగా భూవివాదం ఉంది. ఇల్లు కూలగొట్టి తన భార్యను కొట్టడంతో ఆమె పురుగుల […]
నిబంధనలకు విరుద్ధంగా SRKT స్కూల్

ఇదేం పద్దతి పెద్దాయన ▪️ పైసా ఖర్చు లేకుండా గుడ్ విల్ లాక్కున్నారుగా ▪️ ఇదేనా మీ జనహిత నినాదం ▪️ SRKT స్కూల్ పై సోషల్ మీడియాపై ట్రోలింగ్ కొత్తగూడెం (తెలంగాణ వాణి) స్థానిక కొత్తగూడెం మున్సిపాలిటీ 19 వ వార్డు పరిది గొల్లగూడెంలో గత 20 సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వ అనుమతులతో శ్రీ రాగా స్కూల్ నడుస్తుండగా సడన్ గా ఆ బిల్డింగు ఓనర్ స్కూల్ యాజమాన్యాన్ని దౌర్జన్యంగా బయటికి పంపిన సంగతి […]
ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్

అశ్వరావుపేట (తెలంగాణ వాణి) అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ను భద్రాద్రి కొత్తగూడెం యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్ మర్యాదపూర్వకంగా కలిశారు. యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్బంగా ఈ నెల 12 న పాల్వంచ పెద్దమ్మతల్లి గుడి నుండి కొత్తగూడెం విద్యానగర్ లోని రెవిన్యూ మంత్రి పొంగులేటి క్యాంప్ ఆఫీస్ వరకు చేపట్టనున్న విజయోత్సవ ర్యాలీకి హాజరవ్వాలని ఎమ్మెల్యే ఆదినారాయణను చీకటి కార్తీక్ ఆహ్వానించారు. ఈ సందర్బంగా చీకటి కార్తీక్ […]
ఉచిత మట్టి గణపతులు పంపిణీ చేసిన ప్రముఖ వ్యాపార వేత్త

బిచ్కుంద/కామారెడ్డి (తెలంగాణ వాణి ప్రతినిధి) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ప్రముఖ వ్యాపార వేత్త బండయప్ప పటేల్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతులను బిచ్కుంద మఠాధిపతి శ్రీ శ్రీశ్రీ 108 సోమలింగా శివాచార్య స్వామిజీ వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. మఠాధిపతి స్వామిజీ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిపై ఉందని మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి పంపిణీ చేసినందుకు సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో బండయప్ప పటేల్, సిద్దు […]