UPDATES  

ఉచిత మట్టి గణపతులు పంపిణీ చేసిన ప్రముఖ వ్యాపార వేత్త

బిచ్కుంద/కామారెడ్డి (తెలంగాణ వాణి ప్రతినిధి) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ప్రముఖ వ్యాపార వేత్త బండయప్ప పటేల్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతులను బిచ్కుంద మఠాధిపతి శ్రీ శ్రీశ్రీ 108 సోమలింగా శివాచార్య స్వామిజీ వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. మఠాధిపతి స్వామిజీ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిపై ఉందని మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి పంపిణీ చేసినందుకు సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో బండయప్ప పటేల్, సిద్దు […]

తెలంగాణ వాణి కథనానికి స్పందన

మల్హర్రావు (తెలంగాణ వాణి) మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో కొన్ని నెలలుగా వీధి దీపాలు వెలగడం లేదని తెలంగాణ వాణి దినపత్రికలో ప్రచురించిన కథనానికి స్పందించిన గ్రామపంచాయతీ కార్యదర్శి సాయిచరణ్ గ్రామంలో వీధి దీపాలను ఏర్పాటు చేయడం జరిగింది.

పుచ్చకాయ గింజలను పారేస్తున్నారా? ఎన్ని లాభాలో తెలిస్తే వదిలేయరు..

చిన్న పిల్లలకు ఏవైనా గింజలు తింటే కడుపులో మొక్కలు వస్తాయని చెబుతుంటారు. వామ్మో కడుపులో చెట్లు అవుతాయట ఈ గింజలు తినవద్దు అని ఏవైనా ఉమ్మేస్తుంటారు చిన్నపిల్లలు. వారే కాదు పెద్దవారు కూడా చాలా గింజలను తినరు. అయితే పుచ్చకాయ గింజలను కూడా ఇలాగే ఉమ్మేస్తారు. కానీ వీటివల్ల చాలా లాభాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. మరి ఓ సారి లుక్ వేసేయండి. పుచ్చకాయ గింజల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయట. ఇందులో కేలరీలు కూడా చాలా […]

నల్ల మచ్చలు ఉన్న అరటి పండ్లు విషపూరితమా?

అరటి పండును ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. తియ్యగా కాస్త తక్కువ ధరలో లభించే ఈ అరటి పండుకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. మరి ఈ అరటిపండుతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే అసలు వదలరు. ఇందులో ఉండే పీచు పదార్థం, పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ అరటి పండ్లు ఎన్నో రకాలుగా ఉంటాయట. ఇదిలా ఉంటే పచ్చటి అరటి పండు మీద రవ్వంత నల్లటి మచ్చ ఉంటే తినవద్దు అంటారు. […]

సర్కార్ సంచలన నిర్ణయం.. 70 వేల ప్రభుత్వ ఉద్యోగులపై వేటు..

ఇప్పటికే ఆర్థిక మాంద్యం తీవ్రస్థాయిలో పెరిగింది. కొనుగోళ్ళు నిలిచిపోవడంతో చాలావరకు సంస్థలు వ్యయ నియంత్రణ పద్ధతులు పాటిస్తున్నాయి. ఐటీ సంస్థలైతే అడ్డగోలుగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కోవిడ్ సమయంలో ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇచ్చి పని చేయించుకున్న ఆ సంస్థలు.. ఇప్పుడు మెడపట్టి బయటికి గెంటేస్తున్నాయి.. గతంలో పింక్ స్లిప్ లు ఇచ్చి బయటికి పంపించేవి. కానీ ఇప్పుడు ఒక్క వీడియో కాల్ ద్వారానే “గెట్ లాస్ట్ ఫ్రం హియర్” అంటున్నాయి.. ఇప్పటికే లక్షల్లో ఉద్యోగులు ఐటి కొలువులు […]

మాల్దీవులకు చైనా నీటి సాయం.. టిబెట్‌ నుంచి 1500 టన్నుల నీరు చేరవేసిన డ్రాగన్‌

భారత్‌తో వివాదం తర్వాత మాల్దీవులకు చైనా మరింత దగ్గరైంది. మాల్దీవులకు అన్నివిధాలా సాయం చేసేందుకు డ్రాగన్‌ కంట్రీ సిద్ధమైంది. తాజాగా మాల్దీవుల్లో నీటి కొరత ఏర్పడింది. దీంతో ఆ దేశానికి 1500 టన్నుల తాగునీరును చైనా అందజేసింది. చైనా ఆధీనంలో ఉన్న టిబెట్‌లోని హిమనీ నదాల నుంచి చైనా వీటిని సేకరించి మాల్దీవులకు పంపించింది. టిబెట్‌ అటానమస్‌ రీజియన్‌ ఛైర్మన్‌ యాన్‌ జిన్హాయ్‌ మాల్దీవుల్లో గతేడాది నవంబరులో పర్యటించిప సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన అధ్యక్షుడు […]

ఎలాన్ మస్క్ పెద్ద మనసు.. భారత సంతతి వైద్యురాలికి ఆర్థిక సాయం.. !

కరోనా మహమ్మారి 2020 ఏడాదిని తలకిందులు చేసింది. ప్రపంచమంతా ఒక్కసారిగా స్తంభించిపోయింది. దీంతో సామాన్య ప్రజలు మొదలు.. వ్యాపార వేత్తల వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి కష్టాలను చూసి కెనడాలోని భారత సంతతి వైద్యురాలు కుల్విందర్ కౌర్ గిల్ చలించిపోయారు. దీంతో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించారు. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌, టీకా ఆదేశాలకు తీవ్ర విమర్శలు ఎదరయ్యాయి. వైద్యవర్గాలు సైతం ఆమెను తప్పుబట్టాయి. ఆమెపై కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. నాటి నుంచి కోర్టు […]

బెంగళూరే కాదు.. హైదరాబాద్‌తో సహా ఆ 30 నగరాలకు పొంచి ఉన్న నీటి కష్టాలు!

వేసవి ప్రారంభంకాక ముందే బెంళూరులో నీటి కష్టాలు తారా స్థాయికి చేరుకుంది. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ బెంగళూరు నగర వాసుల జీవనం దినదినగండంగా మారింది. భారత సిలికాన్ వ్యాలీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నగరం ప్రజలు బకెట్ నీళ్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. బెంగళూర్‌ నగరం పూర్తిగా భూగర్భ జలాలు, కావేరీ నది నీటీపై ఆధారపడింది. ఈ ఏడాది ఒక్కసారిగా భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో సమస్య మొదలైంది. దీంతో అక్కడి ప్రజలు […]

తొలిసారి వ్యాపార భాగస్వాములుగా మారిన అంబానీ-అదానీ.. పవర్‌ ప్రాజెక్టులో 26% వాటా కొనుగోలు చేసిన రిలయన్స్

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు, అపర కుబేరులు ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ తొలిసారి వ్యాపార భాగస్వాములు అయ్యారు. గుజరాత్‌కు చెందిన వీరిద్దరి మధ్య కనిపించని పోటీ ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం. సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న వీరిద్దరూ ప్రస్తుతం వ్యాపార రంగంలో చేతులు కలిపారు. దీనిలో భాగంగా అదానీ పవర్‌ లిమిటెడ్‌కు పూర్తి అనుబంధ సంస్థ అయిన పవర్‌ ప్రాజెక్టులో 26 శాతం వాటాను ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్ కొనుగోలు […]

క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు సెలబ్రిటీ అయిన ప్రస్థానం

ఒకరు టెక్కీ రెవల్యూషన్‌కి మొదటి దిక్సూచి. మరొకరు ఆ టెక్నాలజీని సామాన్యుడి అరచేతిలోకి చేర్చిన దార్శనికుడు. ఒకరు వ్యాపారవేత్త, మరొకరు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి సారధి. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌, భారత ప్రధాని మోదీ. వీళ్లిద్దరి మధ్య చాయ్‌ పే చర్చ జరిగితే ఎలా ఉంటుంది.. ఏయే అంశాలు ప్రస్తావనకొస్తాయి..? ఏయే ఎక్స్‌ట్రీమ్స్‌ని టచ్ చేస్తారు..? అసలు ఈసారి చాయ్‌పే చర్చతో మోదీ ఏం సాధించాలనుకున్నారు? క్రియేటివిటీని విచ్చలవిడిగా వాడెయ్యడంలో మోదీ తర్వాతే ఎవరైనా. 2014 […]