అంబేద్కర్ యువజన సంఘం జిల్లా పగ్గాలు మళ్లీ మహేందర్కే

కరీంనగర్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నియామక పత్రం అందజేత కరీంనగర్ టౌన్,అక్టోబరు 4 (తెలంగాణ వాణి ప్రతినిధి): ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా న్యాయవాది జేరిపోతుల మహేందర్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం కరీంనగర్లో నిర్వహించిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బొంకురి మధుల సమక్షంలో ఆయనకు నియామక పత్రం అందజేశారు. అంబేద్కర్ ఆశయాలు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం […]
అంతర్గాం నూతన ఎస్సైగా టి. ఉదయ్ కిరణ్ బాధ్యతల స్వీకరణ

మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన పొట్యాల ఉప సర్పంచ్ బొండ్ల సురేష్ పెద్దపల్లి : అక్టోబర్, 3 (తెలంగాణ వాణి జిల్లా ప్రతినిధి) అంతర్గాం పోలీస్ స్టేషన్ నూతన సబ్ఇన్స్పెక్టర్ (ఎస్సై)గా టి. ఉదయ్ కిరణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పొట్యాల గ్రామ ఉప సర్పంచ్ బొండ్ల సురేష్ నూతన ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా బొండ్ల సురేష్ మాట్లాడుతూ అంతర్గాం మండలంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు పోలీస్ […]
స్వచ్ఛ మిషన్లో భాగంగా శ్రమదానం..

స్వయంగా మొట్లను మోసిన సర్పంచ్ భర్త హరీష్ ధర్మారం, (తెలంగాణ వాణి): స్వచ్ఛభారత్ మిష న్ లో భాగంగా ధర్మారం మండలంలోని పత్తిపాక గ్రామంలో గురువారం స్థానిక సర్పంచ్ మాందాల శ్రావణి హరీష్ అద్వర్యంలో గ్రామ ప్రజలు యువత స్వచ్ఛంద సేవకులతో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. మూడు గంటల పాటు నిర్వహించిన ఈశ్రమధాన కార్యక్రమంలో రోడ్డుకు ఇరువైపున ఉన్న చెత్త చెదారం పిచ్చి మొక్కలను ఉపయోగపడని చెట్లను తొలగించి ట్రాక్టర్ లో తరలించారు. ఇక్కడ స్థానిక సర్పంచ్ […]
వేములవాడ రూరల్ పరిధిలో ఆలయాల్లో చోరీలు

వేములవాడ, సెప్టెంబర్ 28 (తెలంగాణ వాణి):వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలోని ఎల్లమ్మ, పెద్దమ్మ దేవాలయాలతో పాటు బాలరాజుపల్లి పెద్దమ్మ దేవాలయంలో సెప్టెంబర్ 27 అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడ్డారు.ఆలయాల్లోని నగదు, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. కేసులు నమోదు చేసి సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఆలయ నిర్వాహకులు నగదు, విలువైన వస్తువులు ఉంచకుండా […]
గోదావరి నది పరివాహక ప్రాంతంలో క్లీన్లీనెస్ డ్రైవ్

ఎన్టీపీసీ రామగుండం ఆధ్వర్యంలో ‘క్లీన్ రివర్–గ్రీన్ ఫ్యూచర్’ కార్యక్రమం
ఏసీబీకి పట్టుబడ్డ మెట్పల్లి ఐసిడిఎస్ సిడిపిఓ

మెట్పల్లి:సెప్టెంబర్26(తెలంగాణ వాణి)మెట్పల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ పద్మ శనివారం సాయంత్రం 63 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ కరీంనగర్ యూనిట్ అధికారులు పట్టుకున్నారు.మెట్పల్లి పట్టణ సెక్టార్ లోని 21 అంగన్వాడి కేంద్రాల నుండి ప్రతినెల ఒక్కో అంగన్వాడి కేంద్రానికి వెయ్యి రూపాయల చొప్పున మూడు నెలలకు సంబంధించిన 63 వేల రూపాయల లంచం ఒకేసారి కావాలని డిమాండ్ చేయగా బాధితులు ఏసీబీని ఆశ్రయించారని తెలిసింది. దీనితో ఏసీబీ అధికారులు శనివారం సాయంత్రం 63 వేల […]
పేదలకు అండగా సాయి రూప చారిటబుల్ ట్రస్ట్

వేములవాడ 12 సెప్టెంబర్ (తెలంగాణ వాణి): పేదలకు అండగా నిలుస్తూ సాయి రూప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు ఇప్పపూల అజయ్ తండ్రి ఇప్పపూల లక్ష్మీరాజం జ్ఞాపకార్థం శనివారం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో పేదలకు గొడుగులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు ఇప్పపూల మమత–అజయ్ మాట్లాడుతూ.. సాయి రూప చారిటబుల్ ట్రస్ట్ పేదలకు భరోసాగా నిలుస్తూ, సమాజ సేవలో […]
అగ్ని ప్రమాద బాధితులకు కొత్త ఇళ్లు

బండపల్లి, సెప్టెంబర్ 10 (తెలంగాణ వాణి ప్రతినిధి):అగ్ని ప్రమాదంలో ఇళ్లు కాలిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న మంజుల, శేఖర్, రజిత కుటుంబాలు ఎట్టకేలకు నూతన ఇళ్లలోకి అడుగుపెట్టారు. నూతనంగా నిర్మించిన ఇళ్లకు గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సర్పంచ్ కటకం మల్లేశం, ఉపసర్పంచ్ ఈసాక్తో పాటు గ్రామ పెద్దలు హాజరై బాధిత కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. అగ్ని ప్రమాదంతో సర్వం కోల్పోయిన కుటుంబాలు తిరిగి సొంతింటిలో అడుగుపెట్టడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. నూతన ఇళ్లలో […]
వేములవాడ మున్సిపల్ నూతన పాలకవర్గానికి విప్ ఆది శ్రీనివాస్ శుభాకాంక్షలు
వేములవాడ: ఫిబ్రవరి 21 (తెలంగాణ వాణి): వేములవాడ మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన పుల్కం రాజు మరియు వైస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నరాల శేఖర్ ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై, నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్లను పూలమాలలతో సన్మానించి, వేములవాడ పట్టణ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. పట్టణ ప్రజల సమస్యల […]
తడ్కల్ లో శ్రీ జగద్గురు తుకారాం మహారాజ్ ఘథా పూజ
తుకారం ఘథా పూజ నిర్వహించిన సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి, సంగారెడ్డి,కంగ్టి,జనవరి 09,( తెలంగాణ వాణి ప్రతినిధి ) సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ రుక్మిణి పాండురంగ, ఆలయంలో వైష్ణవ సాంప్రదాయిక అఖండ హరినామ్ సప్తహ ముడవ వార్షికోత్సవంలో భాగంగా శుక్రవారం దేహు నివాసి శ్రీ జగద్గురు తుకారం మహారాజ్ పంచమా వేదమైన తుకారం ఘథా పూజా కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి, నిర్వాహకులు ఎలిశల హనుమంత్ రెడ్డి, కుటుంబ సభ్యులతో అంగరంగ వైభవంగా […]