యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ దేశ వ్యాప్తంగా రక్త దాతలను అందిస్తున్న జె బి బాలు అభినందనీయులు
యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ జె.బి. బాలును మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను బహుమతిగా అందజేసిన ఐక్య తల్లిదండ్రుల సంఘం (యునైటెడ్ పేరెంట్స్ అసోసియేషన్) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మారుతి రత్నాకర్,యంగ్ ఇండియన్ సేవా పురస్కార్ అవార్డు గ్రహీత బాలునాయక్. ఈ సందర్భంగా జె బి బాలు దేశంలో రక్త దాతల క్లబ్ ను ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారని కొనియాడారు.ఈ సందర్భంగా ఆయన రత్నాకర్,బాలు నాయక్ లను శాలువాతో కప్పి చిరు […]
ఎస్.ఎస్.స్సి బోర్డు నందు అసిస్టెంట్ కమిషనర్ గా పదోన్నతి పొందిన కోటేశ్వర రావుకు మొక్కతో శుభాకాంక్షలు
తెలంగాణ ఎస్.ఎస్.స్సి బోర్డు హైదరాబాద్ నందు అసిస్టెంట్ కమిషనర్ గా పదోన్నతి పొందిన కోటేశ్వర రావు(కోటి రావు)కు “బొకేలు వద్దు మొక్కలే ముద్దు” అనే నినాదంతో మొక్కలతో శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి ప్రేమికుడు యంగ్ ఇండియన్ సేవా పురస్కార అవార్డు గ్రహీత యునైటెడ్ పేరెంట్స్ అసోసియేషన్ పర్యావరణ పరిరక్షణ విభాగం చైర్మన్ బాలు నాయక్,ఆయన సహాచర ఉద్యోగి పి డి బుగ్గ వెంకటేశ్వర్లు ద్వారా ఆ మొక్కను అందజేసారు.
తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు

కరీంనగర్ (తెలంగాణ వాణి) కరీంనగర్, నిర్మల్ జిల్లాల్లో 3.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టం లేనప్పటికి అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమాయ్యారు. కాగా ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.2 నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో పలు మండలాల్లో భూమి కంపించిన సీసీ టీవీ ఫుటేజ్ లు సామాజిక మధ్యామాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ భూప్రకంపనలు […]
పుట్టిన రోజు ఓ మొక్కను బహుమతిగా ఇవ్వండి: ప్రకృతి ప్రేమికుడు కళ్యాణ్
పుట్టినరోజు బహుమతిగా మొక్కలు ఇవ్వడం ఒక మంచి ఆలోచన.అవి అందం,ఆరోగ్య ప్రయోజనాలు మరియు పర్యావరణానికి సహాయపడతాయని ప్రకృతి ప్రేమికుడు మొక్కల కళ్యాణ్ పుట్టినరోజు బహుమతిగా ఓ మొక్కను యంగ్ ఇండియన్ సేవా పురస్కార అవార్డు గ్రహీత బాలు నాయక్ కు అందించి శుభాకాంక్షలు తెలిపారు.ప్రతి రోజు ఓ మొక్కను నాటుతూ యువతకు ఆదర్శంగా ఉన్న కళ్యాణ్ ను బాలు నాయక్ అభినందించారు
యంగ్ ఇండియన్ సేవా పురస్కార అవార్డు గ్రహీత యం.బాలు నాయక్ పుట్టిన రోజు మొక్కను నాటిన కె ఎన్ రాజశేఖర్
తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకృతి హరిత దీక్ష మరియు గ్రీన్ మోటార్ వెహికిల్ గార్డెన్ వ్యవస్థాపకులు, సింగరేణియన్ కె.ఎన్ రాజశేఖర్ ప్రముఖుల పుట్టిన రోజు పెళ్ళి రోజు సందర్భంగా మొక్కలు నాటడం మరియు ప్రతి రోజు ఓ మొక్కను నాటడం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ప్రకృతి హరిత దీక్ష గౌరవ సభ్యులు,యంగ్ ఇండియన్ సేవా పురస్కార అవార్డు గ్రహీత,సమాజ సేవకుడు,ప్రకృతి ప్రేమికులు మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ఆంగ్ల ఉపాధ్యాయులు బాలు నాయక్ పుట్టినరోజు సందర్భంగా శనివారం […]
పదో తరగతి ఫలితాల్లో రేలకాయలపల్లి ప్రభంజనం..సమిష్టి కృషితోనే 100% ఫలితాలు: హెచ్ ఎం శ్రీనివాసరావు నాయక్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం నాడు పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు.ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయలపల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులు 100% ఫలితాలతో విజయకేతనం ఎగురవేశారు. విద్యార్థులు కష్టపడి చదివిన ఫలితం దక్కిందని 100% రావడానికి కృషి చేసిన ఉపాధ్యాయులందరికీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు నాయక్ ఉపాధ్యాయులకు చరవాణి ద్వారా అభినందనలు తెలిపారు.
పదవ తరగతి ఫలితాల్లో పెంకె గీతిక విజయకేతనం….పలువురు అభినందనలు
భద్రాద్రి జిల్లా కొత్తగూడెం రామవరం ప్రాంతానికి చెందిన పెంకె గీతిక 10వ తరగతి ఫలితాలలో 560 మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేసింది.గీతిక తల్లి ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ ఆఫీసర్,తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పనిచేస్తున్నారు.ఇదే స్ఫూర్తి తో పై చదువులు చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని స్థానిక ప్రజలు పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు.
పిల్లలలో మానసిక ధైర్యాన్ని నింపండి:-TSUTF ఇల్లందు మండల అధ్యక్షులు A.రాంబాబు.
పదవ తరగతి ఫలితాలు ఏ విధంగా ఉన్నప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లల్ని నిరుత్సహా పడకుండా వారిలో మానసిక ధైర్యాన్ని కల్పించాలని TSUTF ఇల్లందు మండల అధ్యక్షులు ఆంగోతు రాంబాబు అన్నారు .ప్రతిభకు మార్కులకు సంబంధం లేదన్నారు. విద్యార్థులు ఫలితాలు ఎలా ఉన్నా ఆందోళన చెందకూడదానీ, ఇది జీవితంలో తొలి అడుగు మాత్రమేనని చెప్పారు.
పద్మశ్రీ వనజీవి రామయ్య అవార్డు అందుకున్న ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహన్.
పద్మశ్రీ వనజీవి రామయ్య అవార్డు అందుకున్న ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహన్.అనంతరం పర్యావరణ పరిరక్షణ కోసం వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో ప్రతిరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా చిరంజీవి మూడు విశ్వామిత్ర చౌహాన్ వెలుగుమట్ల పార్కు లో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి వారసురాలు శాంతాబాయి తో కలిసి మామిడి మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో ప్రతిరోజు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మొక్కల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు
ఉగ్ర దాడిలో మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి తో మొక్కను నాటిన మొక్కల రాజశేఖర్
కాశ్మీర్ పహల్గావులో జరిగినటువంటి ఉగ్ర దాడిలో మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలుపుతూ వారందరి ఘన నివాళులు అర్పిస్తూ పచ్చని మొక్కను నాటిన తెలంగాణ రాష్ట్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకృతి హరిత దీక్ష మరియు గ్రీన్ మోటార్ వెహికిల్ గార్డెన్ వ్యవస్థాపకులు సింగరేణియన్ కె.ఎన్.రాజశేఖర్.కాశ్మీర్ లో ఉగ్రవాద దాడి హేయమైన చర్య అని ఆయన అన్నారు.