ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పోచయ్యకు సన్మానం

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) మండలంలోని కొత్తూరు గ్రామంలో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామంలో సెంట్రల్ లైటింగ్ సిస్టం కు బల్బులు ఏర్పాటు చేయించిన స్థానిక గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాంపల్లి పోచయ్య ను శ్రీ మహాశక్తి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భవాని అమ్మ వారి మండపంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. గత కొంతకాలంగా సెంట్రల్ లైటింగ్ సిస్టం లైట్లు పనిచేయకపోవడంతో ఇట్టి విషయాన్ని కమిటీ సభ్యులు అయినా కాంపల్లి పోచయ్య దృష్టికి తీసుకువెళ్లగా […]
మనిషి లో సద్గుణాలు పెంచేది దసరా – డా. మోటె చిరంజీవి,
మనిషి లో సద్గుణాలు పెంచేది దసరా దసరా అనేది ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించే పండుగ.దైవారాధన, ఉపాసన, నియమ నిష్ఠలతో జరుపుకునే ఈ పండుగ దక్షిణాయనంలో వచ్చే ప్రధాన ఉత్సవాల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో దసరాను జరుపుకుంటారు.ఈ పండుగ తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగ.ఉత్తర భారతదేశంలో కూడా దుర్గా పూజ పేరుతో నవరాత్రులు ఘనంగా జరుగుతాయి.దసరా నవరాత్రుల్లో దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజిస్తారు.అనంతరం విజయదశమి రోజున దుర్గామాత మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించి, […]
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు:బంజారా సేవా సంఘం అధ్యక్షులు:వి.కృష్ణ నాయక్
విజయదశమి పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు బంజారా సేవ సంఘం అధ్యక్షులు రిటైర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వి.కృష్ణ నాయక్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.జిల్లా ప్రజలందరూ దసరా పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపాలని కోరారు.ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆశీస్సులతో ప్రతి పనిలో విజయం సాధిస్తూ మందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆయన తెలియజేసారు.
విజయ్ బ్లడ్ బ్యాంక్ భద్రాద్రి జిల్లా ఇంచార్జ్ బి.వినోద్ కుమార్‌కు ఘన సన్మానం
జాతీయ స్వచ్చంద రక్తదాన దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం ఆధ్వర్యంలో విజయ్ బ్లడ్ బ్యాంక్ ఇంచార్జ్ బి. వినోద్ కుమార్‌కు ఘన సన్మానం చేశారు. రక్తదాతలను ప్రోత్సహిస్తూ, అవసరమైనప్పుడు స్వయంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలుస్తున్న ఆయనను యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండర్ జెబి బాలు, ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు లగడపాటి రమేష్ చంద్ర్, కోనేరు పూర్ణచంద్ర రావు, మోహన్ రావు, […]

అక్టోబర్ 2న సామ్రాట్ అశోక రావణ వర్ధంతి: విద్యార్థులు,మేధావులు తరలి రండి ● అడ్డమైన భావాజాలన్ని పాతరేద్దాం,వాస్తవాలను వెలికి తీద్దాం. ● కుటిల బావవ్యాప్తిని పసిగట్టి రావణ సుర వధ పేరుతో జరుపుతున్న నీచమైన సంస్కృతిని బహిష్కరిద్దాం. హుస్నాబాద్:అక్టోబర్01 (తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్) హుస్నాబాద్ లో నిర్వహించే రావణాసుర వర్ధంతి సభను, సామ్రాట్ అశోక మౌర్య విజయదశమి వేడుకలను విజయవంతం చేయాలని దళిత బహుజన సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు. హుస్నాబాద్ లో బుధవారం నాడు విలేకరుల […]
గోప తండాలో వేంచేసి ఉన్న అమ్మవారిని దర్శించుకున్న సర్పంచ్ తండా మాలలు ధరించిన మాతలు.
దేవి శరన్నవరాత్రులు సందర్భంగా సుజాతనగర్ మండలం సర్వారం గోప తండాలో వేంచేసి ఉన్న అమ్మవారిని దర్శించుకున్న సర్పంచ్ తండా మాలలు ధరించిన మాతలు.ఈ సందర్భంగా తండా వాసులందరూ సుఖ శాంతులతో ఉండాలని పాడిపంటలు బాగా పండాలని మాతలు కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో గోప తండా దేవి అమ్మవారి భక్త బృందం పాల్గొన్నారు
వీధివీధినా బెల్ట్ షాపులు..

ప్రోత్సహిస్తున్న వైన్స్ నిర్వహకులు… గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం… ఇళ్లలోనే మద్యం అమ్మకాలు… రుద్రూర్ (తెలంగాణ వాణి) గ్రామాల్లో మద్యం ఏరులైపారుతోంది. అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ దందా జోరు పెరుగుతున్నది. ప్రతీ గ్రామానికో మెడికల్ షాప్ ఉంటుందో ఉండదో కానీ, వీధికొక బెల్ట్ షాప్ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడో ఎలక్షన్లప్పుడో, కొన్ని సందర్భాల్లో నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్న పోలీస్, ఎక్సైజ్ శాఖలు తర్వాత వారికి సహకరించినంత పని చేస్తున్నారు. ప్రోత్సహిస్తున్న వైన్స్ నిర్వాహకులు… నిజామాబాద్ […]
కోటక్ బ్యాంక్ మేనేజర్ హరీష్ కు మొక్కలు వితరణ చేసిన యంగ్ ఇండియన్ పర్యావరణ పరిరక్షణ జాతీయ అవార్డు గ్రహీత ప్రకృతి ప్రేమికుడు బాలునాయక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కోటక్ బ్యాంక్ మేనేజర్ హరీష్ కు మొక్కలు వితరణ చేసిన యంగ్ ఇండియన్ పర్యావరణ పరిరక్షణ జాతీయ అవార్డు గ్రహీత ప్రకృతి ప్రేమికుడు బాలునాయక్.ఈ సందర్భంగా బాలు నాయక్ మాట్లాడుతూ సమస్త మానవాళికి మనుగడకు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో ఏదైనా శుభకార్యం రోజు ఒక మొక్క నాటి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో హర్షద్ సయ్యద్ తదితరులు పాల్గొన్నారు
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ (తెలంగాణ వాణి) స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ఇవాళ(సోమవారం) విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత వార్డులు, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. అక్టోబర్ 9వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఎన్నికల సంఘం. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం ఐదు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్ 9వ తేదీన స్థానిక సంస్థల […]
రేపు దొంగతూర్థి గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం

ఇన్చార్జి తహసిల్దార్ ఉదయ్ కుమార్ ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని దొంగతుర్తి గ్రామంలో సోమవారం ఉదయం 11 గంటలకు పౌరహక్కుల దినోత్సవం నిర్వహించనున్నట్లు ధర్మారం ఇన్చార్జి తహసిల్దార్ ఉదయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, అంటరానితనం రెండు గ్లాసుల విధానం పై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని కుల సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొనాలని కోరారు.